Health Benefits : బచ్చల కూరతో బోలెడు ప్రయోజనాలు….. అవేంటో తెలిస్తే విడిచిపెట్టారు.

Health Benefits : మనం రోజు ఎన్నో రకాల ఆకుకూరలను తింటూ ఉంటాము. ఈ కూరలు ఆరోగ్యానికి చాలా మేలుని కలిగిస్తాయి. ఆకుపచ్చని కూరలన్నింటిలో కెల్లా బచ్చలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరానికి ఈ కూర దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అయితే చాలామంది బచ్చల కూర తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఈ కూరలో ఉండే లాభాల ఏంటో తెలిస్తే మాత్రం ఇక మీరు జీవితంలో విడిచిపెట్టారు. బచ్చల కూరను పల్లెటూర్లలో ఇంటిదగ్గర ఖాళీ ప్రదేశంలో లేదా పెరట్లో పండిస్తారు. ఈ కూరను పండించడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. భూమిలో ఒక గింజ నాటితే చాలు పైకి తీగల రూపంలో అల్లుకుపోతుంది.

Advertisement

Health Benefits : బచ్చల కూరతో బోలెడు ప్రయోజనాలు…..

పప్పులో బచ్చల కూరను వేసుకొని తింటే జలుబు, దగ్గు ,జ్వరం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. దీనిని రెగ్యులర్ గా తినడం వల్ల మోషన్స్ సాపీగా సాగుతుంది. కామెర్ల సమస్యతో బాధపడే వారికి ఈ కూర మంచి మందుల పని చేస్తుంది. బచ్చల కూర తినడం వల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారికి ఈ కూర దివ్య ఔషధం అని చెప్పవచ్చు. అంతేకాకుండా కంటి చూపుని మెరుగుపరుస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, మలినాలను తొలగింపబడుతుంది.

Advertisement
health benefits of bachalakura Spinach
health benefits of bachalakura Spinach

దీంతో విషపూరితమైన పదార్థాలు మన శరీరంలో ఉన్నట్లయితే వెంటనే బయటికి వస్తాయి. ఈ ఆకులను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు అన్ని బయటకు వెళ్లిపోతాయి. దీంతో పొట్ట క్లీన్ అవుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. బిపి ఉన్నవారు బచ్చల కూర తీసుకోవడం వల్ల ఈ సమస్య కొంచెం తగ్గుముఖం పడుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి.

Advertisement