Health Benefits : అరటిపండు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్… అసలు ఎటువంటి అరటిపండు తీసుకోవాలి?

Health Benefits : అరటిపండు తినని వారు అంటే ఉండరు , పిల్లల నుండి పెద్దవారి వరకు అరటిపండును చాలా ఇష్టపడతారు. అన్ని సీజన్లో లభించే ఈ అరటి పండును రోజు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటికాయ పండుకు వచ్చే కొద్ది సాధారణ చెక్కెర మార్పులకు గురవుతుంది. పసుపు రంగు అరటి పండు కంటే గోధుమ రంగు మచ్చలు ఉండే అరటిపండులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అరటిపండు లో ఉండే పోషకాలు అధిక రక్తపోటు, మధుమోహం, ఆస్తమా, క్యాన్సర్, మలబద్దక, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

Advertisement

ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముకలు, దంతాలను దృడంగా చేస్తుంది. మహిళలు రోజు అరటిపండు ఒకటి తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అరటిపండు లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్దక, జీర్ణ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. ఫ్రీ రాడికల్స్ ఏర్పడి క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజు ఒక అరటి పండును తీసుకోవడం వల్ల అరటి పండులో కొవ్వు ఉండదు. పూర్తి పక్వానికి రాని అరటిపండులో రెసిడెన్స్ స్టార్చ్ ఉంటుంది.

Advertisement

Health Benefits : అరటిపండు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్

Health Benefits of banana
Health Benefits of banana

ఇది కడుపు నిండిన భావన కలిగించి ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. బ్రేక్ ఫాస్ట్ తరువాత రోజూ ఒక అరటిపండు తీసుకుంటే బీపీ, ఒత్తిడి, జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. పెరుగు అన్నంలో ఒక అరటి పండును నంజుకోని తినడం వల్ల తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. మార్కెట్లలో పచ్చికాయ ని వెంటనే పసుపురంగులోకి మార్చేసి అమ్ముతున్నారు. కార్బైడ్ తో పండించిన అరటిపండు కాడ పచ్చగా ఉంటుంది. ఎటువంటి మచ్చలు ఉండవు. నేచురల్ గా ఉండే అరటిపండు గుత్తి నల్లగా ఉంటుంది తొక్క పై చిన్న చిన్న మచ్చలు ఉంటాయి. ఈ అరటిపండు లేత పసుపు రంగులో ఉంటుంది. రోజు ఒక అరటిపండు తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు.

Advertisement