Black Rice : కాలంలో బ్లాక్ రైస్ ని నిషిద్ధ బియ్యం గా పిలిచేవారు. గత రోజుల్లో ఈ బియ్యాన్ని గొప్పవారు మాత్రమే తినేవారట .వైట్ రైస్ కంటే బ్లాక్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. త ద్వారా నల్ల బియ్యాన్ని తింటే వివిధ రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఈ బ్లాక్ రైస్ గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. వ్యవసాయదారులు గత రెండు మూడేళ్ల నుంచి దేశవ్యాప్తంగా బ్లాక్ రైస్ ని పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో బ్లాక్ రైస్ ను పండిస్తున్నారు. కాకపోతే చాలా తక్కువ మంది కొన్ని ప్రదేశాలలో మాత్రమే నల్ల బియ్యాన్ని పండిస్తున్నారు. బియ్యం మార్కెటల్లో ఈ రైస్ వినియోగం చేస్తున్నారు.
వైట్ డ్రెస్ బియ్యం ధర కంటే బ్లాక్ రైస్ బియ్యం ధర నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. వైట్ రైస్ ధర కిలో 100 రూపాయలు ఉంటే… బ్లాక్ రైస్ ధర మాత్రం 400 వరకు ఉంటుంది. అందుకే చాలామంది ఈ బియ్యాన్ని కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. కాకపోతే ఈ బియ్యం లో ఉండే పోషకాలు వల్ల… ఈ బియ్యాన్ని తింటే ఆరోగ్యపరంగా చాలా లాభాలు కలుగుతాయి. బ్లాక్ రైస్ నల్లని వర్ణాన్ని కలిగి ఉంటాయి. 200 గ్రాములు బ్లాక్ రైస్ ను తీసుకుంటే.. అందులో 15.6 గ్రాముల ప్రోటీన్. 7.2 గ్రాములు ఐరన్. 8.2 గ్రాములు ఫైబర్, 16.5 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. కోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉంటాయి.
Black Rice : బ్లాక్ రైస్ లో ఉండే పోషకాలు గురించి తెలిస్తే ఇక మీరు వదలరు.

ఇది మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ని అందజేస్తాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ బియ్యం మంచి మందులా గా పనిచేస్తాయి. విటమిన్స్, ఖనిజాలు బ్లాక్ రైస్ లో ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ తో పాటు క్యాన్సర్ గుండె సంబంధిత జబ్బులు రాకుండా ఈ రైస్ నివారిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు వల్ల ఆయుర్వేదంలో మెడిసిన్ తయారీలో వీటిని బాగా ఉపయోగిస్తున్నారు. బ్లాక్ రైస్ ని వ్యవసాయదారులు రసాయనాలు వేసి పండించారు. సహజ సిద్ధమైన మందులతో పండిస్తారు. వీటికి రసాయనాల అవసరం లేకుండా సేంద్రియ ఎరువులతో వీటిని పండించడం వల్ల ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.