Health Benefits : చింత చిగురును ఎలా తీసుకోవాలి… ఈ చిగురుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం.

Health Benefits : పల్లెటూరులో విరివిరిగా లభించే ఈ చింతచిగురు ఇప్పుడు సిటీలలో అత్యంత ఖరీదైన కూరగాయల్లో ఒకటి గా మారింది. పట్టణాలలో దీన్ని డిమాండ్ అంతా ఇంతా కాదు మార్కెట్లలో కిలో 500 పలుకుతుంది. చికెన్ ,రొయ్యలు చేపలు, వీటి ధరలతో పాటు సమానంగా ఉందన్నమాట. చింత చిగురు లో ఆరోగ్యానికి మేలు చేసే వివిధ రకాల పోషకాలు మరియు ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పట్టణవాసులు ఆసక్తి చూపుతున్నారు. పుల్లటి రుచితో ఉండే ఈ చింతచిగురు గ్రామాలలో ప్రజలు చికెన్, మటన్ ,చాపలు, రొయ్యలు వంటి మాంసాహార వంటకాలలో వేసేవారు. ఇక దీనితో చెట్ని,పులిహోర ,పప్పు వివిధ రకాల తయారు చేస్తారు.

Advertisement

కాల క్రమంలో పల్లెల్లో వారు దీని వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు. కానీ మారిన జీవనశైలి ఆధారంగా ఆరోగ్యం పై దృష్టి, వివిధ రకాల చానల్లో ప్రసారమయ్యే వంటకాలలో చింతచిగురులో ఉన్న పోషక విలువలు మరియు ఔషధ గుణాల గురించి ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పల్లెలకంటే పట్టణాలలోనే చింతచిగురు వినియోగం బాగా పెరిగింది. ఇది సంవత్సరంలో జూన్ జూలై నెలలో మాత్రమే లభిస్తుంది. అందువలన దీని డిమాండ్ పెరిగిపోయింది. పట్టణాలలో ఒకప్పుడు మార్కెట్లలో దీని ధర 100 నుంచి 150కి లభించేది. కానీ ఈ ఏడాది కిలో 500 నుంచి 600 వరకు ఎగబాకింది. ఈ ఆకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

Advertisement

Health Benefits :చిగురుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం.

Health Benefits of chinta chiguru
Health Benefits of chinta chiguru

కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చింతచిగురులో ప్రోటీన్స్ ,ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొవ్వు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 200 గ్రాములు చిగురులో 10.15 గ్రాముల ప్రోటీన్లు, 25 మిల్లీగ్రాముల పీచు పదార్థం, 200 మిల్లీ గ్రాముల క్యాల్షియం, విటమిన్ సి 6 గ్రాములు ఉంటుంది. వైరస్లు, బ్యాక్టీరియాల్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. కాలియాన్ని రక్షిస్తుంది. జీర్ణ క్రియను పెంచి రోగ నిరోధక శక్తిని అధికం చేస్తుంది. ఇన్ని ఔషధ గుణాలున్న చింతచిగురుని వారంలో రెండు సార్లు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Advertisement