Health benefits : ఈ గ‌డ్డి మొక్క గురించి తెలిస్తే షాక్ అవుతారు.

Health benefits : భూమి మీద ఉండే ప్రతి యొక్క మొక్క మనకు ఏదో ఒక విధంగా సహాయ పడతాయి. అందులో ఒకటే గడ్డి చామంతి మొక్క. ఈ గడ్డి చామంతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ మొక్కను వైద్యశాస్త్రంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మొక్క శాస్త్రీయ నామం ట్రై డాక్స్ ప్రోకంబన్.ఈ మొక్కను ఇంగ్లీష్ లో మెక్సికన్ డైసీ ,కోట్ బటన్స్ అని పిలుస్తారు. సంస్కృతంలో జయంతి వేద అని పిలుస్తారు. మనం ఈ మొక్కను ఎక్కువగా పంట పొలాల్లో గట్ల మీద, చెరువు గట్లమీద చూస్తుంటాం అలాగే మన ఇంటి ముందు గార్డెన్స్లో కూడా కనిపిస్తాయి. ఈ మొక్కలతో తో పిల్లలు కూడా ఆడుకుంటారు. ఈ మొక్కను మట్టి పలక మొక్క అని కూడా అంటారు. పూర్వం మన వాళ్ళు పలకలను ఎక్కువగా వాడేవారు. ఈ మొక్క ఆకులతో పలకను రుద్దితే పలక కొత్త దానిలాగా ఉండేది. దీనివల్లనే ఈ మొక్కకు మట్టి పలక మొక్క అని పేరు వచ్చింది. అలాగే గడ్డిచామంతి మొక్కతో ఆరోగ్యపరంగా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1) గాయాలు తగిలి పుండుగా మారి రక్తం కారుతున్న చర్మంపై గడ్డి చామంతి మొక్క ఆకులను బాగా నలిపి ఆ రసాన్ని దెబ్బపై రాస్తే తగిలిన గాయం నయమవుతుంది. పొలంలో పని చేసేవారికి ఆకస్మాత్తుగా ఏదైనా దెబ్బ తగిలితే ఈ మొక్క ఆకులను నలిపి గాయం మీద రాసే వారు. అందుకే రైతులు గడ్డి చామంతి మొక్కను వైద్యుడి లాగా భావిస్తారు. ఈ ఆకులు ర‌క్తం గ‌డ్డ క‌ట్టేలా చేస్తాయి. దీనివ‌ల‌న ఇన్ ఫెక్ష‌న్ రాకుండా ఉంటుంది.

Advertisement

Health benefits : ఈ గ‌డ్డి మొక్క గురించి తెలిస్తే షాక్ అవుతారు.

Health benefits of gaddi chamanti plant
Health benefits of gaddi chamanti plant

2) ఇప్పుడు చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి వివిధ రకాల మెడిసిన్స్ ను వాడుతుంటారు ఎక్కువగా మెడిసిన్స్ ను వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఒకసారి ఈ గడ్డి చామంతి మొక్కల ఆకుల రసాన్ని రోజు కొద్దిగా త్రాగితే సులువుగా డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి గడ్డి చామంతి మొక్క బాగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మొక్కల ఆకులలో ఉండే జేరియలోనిక్ అనే కెమికల్ వలన చక్కెర వ్యాధి కి బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంచడంలో ఈ మొక్క బాగా సహాయపడుతుంది కనుక వీలైనంత వరకు మెడిసిన్ వాడకుండా ఈ గడ్డి చామంతి మొక్క వాడండి. సులువుగా డయాబెటిస్ను కంట్రోల్లో నేర్చుకోండి.

3) మనం త్రాగే నీటిలో క్లోరిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివలన వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారు. అయితే గడ్డిచామంతి మొక్కలకు ఫ్లోరిన్ తగ్గించే శక్తి ఉందంట. అలాగే దోమలను తరిమికొట్టే లక్షణాలు ఈ ఆకులకు ఉన్నాయి. ఈ గడ్డి చామంతి మొక్కల ఆకులను బాగా ఎండబెట్టి ఎండిన ఆకులను ఇంట్లోకి తీసుకువచ్చి పొగబెట్టడం ద్వారా దోమలు చనిపోతాయి. ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటి కెమికల్స్ లిక్విడ్నువాడే బదులు ప్రకృతిలో దొరికే ఈ మొక్కను వాడితే మన ఆరోగ్యానికి చాలా మంచిది.

4) అలాగే గడ్డి చామంతి మొక్కలు మీ కురులను నల్లగా మార్చే శక్తి ఉంది. జుట్టు నల్లగా మారాలంటే గడ్డి చామంతి మొక్కలతో ఇలా నూనె తయారు చేసుకోండి. గడ్డి చామంతి ఆకులు, గుంటగలగర ఆకులను రసంగా చేసుకొని ఈ రసంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి సన్నని మంటపై మరిగించాలి. నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి కోవాలి . తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ నూనెను పోసి చల్లార్చుకోవాలి . తరువాత తలకు బాగా పట్టించాలి. ఈ నూనెను పడుకునే ముందు తలకు రాసుకొని పడుకోవాలి తరువాత ప్రొద్దున తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే తెల్లగా ఉన్న మీ జుట్టు నలుపు రంగులోకి మారిపోతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా కూడా పెరుగుతుంది

Advertisement