Health Tips : ఈ ఆకుల‌తో సులువుగా మీ బాడీలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు…

Health Tips : చాలామంది కొత్తిమీర ఆకుల‌ను తినే ఆహారంలో రుచిని పెంచ‌డానికి వాడుతారు. ఈ ఆకులు మ‌నం తినే ఆహారానికి రుచిని పెంచ‌డ‌మే కాదు మంచి సువాస‌న‌ను కూడా ఇస్తాయి. కొత్తిమీర మ‌నం తినే ఆహారానికే కాదు, మ‌న ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కొత్తిమీర‌ను ర‌సం చేసుకొని తాగ‌డం వ‌ల‌న మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కొత్తిమీర‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు అధిక శాతంలో ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. కొత్తిమీర మొక్క‌ యొక్క వేర్లు, కాండం, ఆకులు, గింజ‌లు అన్ని ఉప‌యోగ‌క‌ర‌మైన‌వి. ఇవి అనేక రోగాల‌ను న‌యం చేస్తాయి.

Advertisement

అలాగే ఈ కొత్త‌మీర ఆకులు క్రిమినాశ‌క మ‌రియు కార్మినేటివ్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ ఆకులు యాంటీమైక్రోబ‌య‌ల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. ఇవి మ‌న శ‌రీరానికి అలెర్జీలు, ఇన్ ఫెక్ష‌న్ లు రాకుండా కాపాడుతాయి. ఇది సాల్మొనెల్లా ఇన్ఫెక్ష‌న్ల‌కు రివ‌ర్స్ గా ప‌ని చేస్తుంది. రోజు కొత్తిమీర ర‌సం తాగితే మ‌న శ‌రీరానికి చాలా మంచిది. అలాగే ఈ కొత్తిమీర ఆకులుతో మ‌న ఆరోగ్యానికి చాలా ఉప‌యోగాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

Health Tips : ఈ ఆకుల‌తో సులువుగా మీ బాడీలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు…

Health benefits of imnunity power in our body with coriander leaves
Health benefits of imnunity power in our body with coriander leaves

కొత్తిమీర ఆకులలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఈ పోష‌కాలు మ‌న శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి బాగా స‌హాయ‌ప‌డ‌తాయి. విట‌మిన్ సి తెల్ల ర‌క్త క‌ణాల ప‌ని తీరును మెరుగుప‌రుస్తుంది. అలాగే మ‌న శ‌రీరంలో ఐర‌న్ ను గ్ర‌హించ‌డానికి బాగా స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా కొత్త‌మీర‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మ‌న బాడీలోని ఎంజైమ్ ల ప‌నితీరును మెరుగుప‌రుస్తుంది. అలాగే ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుప‌రుస్తుంది. మ‌న బ్ల‌డ్ లో చ‌క్కెర శాతాన్ని త‌గ్గిస్తుంది. కొత్తిమీర ర‌సాన్ని రోజు తాగ‌డం వ‌ల‌న డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. క‌నుక షుగ‌రు వ్యాధి ఉన్న‌వారు రోజు కొత్తిమీర ర‌సాన్ని తాగ‌డం మంచిది. అలాగే కొత్తిమీర బాడీలోని వేడిని త‌గ్గిస్తుంది.

మీ బాడీలో అద‌న‌పు నీరును, సోడియంను తొల‌గించ‌డానికి కొత్తిమీర ఆకులు బాగా ప‌నిచేస్తాయి. ఇప్పుడు చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అలాంటి వారు రోజు కొత్తిమీర ర‌సం తాగ‌డం వ‌ల‌న శ‌రీరంలోని చెడు కొల‌స్ట్రాల్ త‌గ్గుతుంది. కొత్తిమీర‌లో కాల్షియం, మాంగ‌నీస్, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్ లాంటి ఖ‌నిజాలు పుష్క‌లంగా దొరుకుతాయి. క‌నుక ఇవి ఎముక‌ల‌కు బ‌లం చేకూరుస్తాయి. అలాగే కొత్త‌మీర ఆకుల‌లో చాలా ఫైబ‌ర్ ఉంటుంది. ఇవి ఎటువంటి జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా కాపాడుతాయి. క‌డుపునొప్పి, అతిసారం, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా కాపాడుతాయి. కొత్తిమీర ఆకుల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటిచూపును పెంచ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి

Advertisement