Pomegranate : దానిమ్మ పండు తింటే గుండెకి చేసే మేలు అంతా ఇంతా కాదు… దీని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Pomegranate : దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ఈ పండుని మన డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా ఉండే ఈ పండు తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. దానిమ్మల ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉంది. ఈ పండులో పొటాషియం మెగ్నీషియం, కాల్షియంతో ,పాటు పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది.

Advertisement

దానిమ్మలో విటమిన్ సి ,బి ,ఏ ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో ఉండే పోషకాలు గుండె జబ్బులు ,హైపర్ టెన్షన్ ,క్యాన్సర్ ,డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి. దానిమ్మ రసాన్ని రోజు ఒక గ్లాస్ తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేశారు. అంతేకాకుండా రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాలను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి.

Advertisement

Pomegranate : దానిమ్మ పండు తింటే గుండెకి చేసే మేలు అంతా ఇంతా కాదు.

health benefits of pomegranats
health benefits of pomegranats

ఒక దానిమ్మకాయలో 80 క్యాలరీలు, 16 కార్బోహైడ్రేట్స్ మరియు మూడు గ్రాములు ఫైబర్ ఉంటుంది. దానిమ్మ పండులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ జ్యూస్ రోజు తాగడం వల్ల రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. అలాగే జీర్ణవ్యవస్థకు సంబంధించిన కడుపునొప్పి ఉబ్బసం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

దానిమ్మలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. దానిమ్మలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కండరాలు దృఢంగా ఉంటాయి. దానిమ్మ పంటి సమస్యలను దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రోజు ఒక గ్లాస్ బ్రేక్ ఫాస్ట్ తర్వాత దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల బిపి ,షుగర్ వంటి వ్యాధులు దరిచేరవు

Advertisement