Health benefits : ఈ మొక్క మీ ఇంట్లో పెరిగితే అద్భుతం జ‌రుగుతుంది.

Health benefits : తుల‌సి మొక్క‌ను మ‌న భార‌తీయులు ఎంత‌గానో పూజిస్తారు. ముఖ్యంగా మ‌న హిందువులు తుల‌సి మొక్క‌ను ప‌ర‌మ‌ప‌విత్రంగా భావిస్తారు. మ‌న పూర్వీకుల కాలం నుంచి దీనికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. తుల‌సి మొక్క శాస్ర్తీయ నామం ఓసిమం టెన్యుఫ్లోరం. దీనిలో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ‌తుల‌సి అని అంటారు. అలాగే లేత రంగులో ఉండేదానిని రామ‌తుల‌సి అంటారు. వీటిలో ఎక్కువ‌గా కృష్ణ‌తుల‌సినే పూజ చేయ‌డానికి వాడుతారు. కొంత‌మంది న‌మ్మ‌కాల ప్ర‌కారం తుల‌సి మొక్క‌ను ల‌క్ష్మీదేవికి ప్ర‌తిరూపంగా కొలుస్తారు. అలాగే తుల‌సి తీర్ధం భార‌తీయ సాంప్ర‌దాయంలో ప్ర‌ముఖ స్థానాన్ని క‌లిగి ఉంది. తుల‌సి మొక్క‌ను స‌ర్వ‌రోగ నివారిణిగా ప‌రిగ‌ణిస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో తుల‌సి మొక్క‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

తుల‌సి మొక్క యాంటీ ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లుమేట‌రి,యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాల‌ను ఎక్కువ‌గా క‌లిగి ఉంటుంది. అంతేకాకుండా ఏ,సి మ‌రియు కె విట‌మిన్లు క‌లిగి ఉంటుంది. అలాగే కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, మాంగ‌నీస్ మ‌రియు ఒమేగా-3 కొవ్వులు మొద‌ట‌గు విలువైన పోష‌కాలను క‌లిగి ఉంటుంది. అందుకేతుల‌సి మొక్క‌కు ఆయుర్వేదంలో అంతా ప్రాధాన్య‌త ఉంటుంది. తుల‌సి ఆకులు మ‌నకు ఙ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డానికి బాగా ప‌నిచేస్తాయి. అంతేకాకుండా తుల‌సి మొక్క వ‌ల‌న మ‌న శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీనివ‌ల‌న మ‌న‌కు ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ‌ల‌న ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోలంఅవుతుంది. కాబ‌ట్టి ఇప్పుడు మ‌న‌కు రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎంతో అవ‌స‌రం. క‌నుక ప్ర‌తిరోజు తుల‌సి మొక్క‌ను తిన‌డం శ్రేయ‌స్ర‌రం. ఇంకా ఈ తుల‌సి వ‌ల‌న మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌యోజ‌నాలు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

Health benefits : ఈ మొక్క మీ ఇంట్లో పెరిగితే అద్భుతం జ‌రుగుతుంది.

Health benefits of these amazing plant
Health benefits of these amazing plant

మ‌నం తిన్న‌ది మంచిగా అర‌గాలంటే జీర్ణ‌శ‌క్తి మెరుగ్గా ప‌ని చేయ‌డం అవ‌స‌రం. అయితే జీర్ణ‌శ‌క్తికి తుల‌సి దివ్యౌష‌ధంలా ప‌నిచేస్తుంది. తుల‌సి ఆకుల‌ను, మిరియాల‌ను మెత్త‌గా దంచి మాత్ర‌లుగా చేసుకొని వాడ‌టం వ‌ల‌న ఆక‌లి పెరుగుతుంది. అలాగే తిన్న‌ది కూడా త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. అలాగే కొందరికి ప‌ళ్ల‌మీద ప‌సుపు ప‌చ్చ‌గా ఏర్ప‌డుతుంది. దీన్ని తొల‌గించుకోవాలంటే కొన్ని తుల‌సి ఆకుల‌ను ఎండ‌బెట్టి మెత్త‌గా పొడిలాగా చేసుకోవాలి. రోజు ప‌ళ్లు తోముకునేట‌ప్పుడు పేస్ట్ లో క‌లిపి రుద్దుకోవ‌డం వ‌ల‌న దంతాలు తెల్ల‌గా, గ‌ట్టిగా త‌యార‌వుతాయి. అలాగే మ‌న బాడీలో వేడిని త‌గ్గిస్తుంది. అలాగే జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు కొంచెం పుదీన‌, కొన్ని తుల‌సి ఆకుల‌ను నీటిలో వేడి చేసి తాగితే జ్వ‌రం త‌గ్గుతుంది. క‌ళ్ల మంట‌లు, క‌ళ్ల నుంచి నీరు కార‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు తుల‌సి ఆకుల ర‌సాన్ని దూదితో క‌నురెప్ప‌ల మీద అద్దుకోవాలి. ఇలా చేస్తే న‌యం అవుతుంది.

వానాకాలంలో మ‌న‌ల్ని ఎక్కువ‌గా బాధించేవి ద‌గ్గు, జ‌లుబులు. వీటి నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొందాలంటే తుల‌సి ఆకుల‌ను ర‌సంగా చేసుకొని కొద్దిగా తేనే వేసుకొని బాగా క‌లిపి రోజు టీ లాగా తాగ‌డం వ‌ల‌న ద‌గ్గు, జ‌లుబులు ద‌గ్గ‌రికి కూడా రావు. అలాగే పిరికెడు తుల‌సి ఆకుల‌ను నీళ్ల‌లో వేసి బాగా మ‌రిగించి తాగ‌డం వ‌ల‌నగొంతు నొప్పి త‌గ్గుతుంది. అలాగే విరోచ‌నాలు అవుతున్న వారు తుల‌సి ర‌సం, ఉల్లిపాయ ర‌సం, అల్లం ర‌సం, తేనే క‌లిపి ఆరు స్ఫూన్లు రోజు తాగితే విరోచ‌నాలు త‌గ్గుతాయి.అధిక బ‌రువు ఉన్న‌వారు మ‌జ్జిగ‌లో తుల‌సి ఆకుల‌ను వేసుకొని తాగితే సులువుగా బ‌రువు త‌గ్గుతారు. నిద్ర‌లేమితో బాధ‌ప‌డేవారు అడ‌వి తుల‌సి ర‌సంలోకొంచెం పంచ‌దార వేసుకొని రోజు ప‌డుకునే ముందు రెండు స్ఫూన్లు తాగితే మంచిగా నిద్ర‌ప‌డుతుంది.

Advertisement