Expensive Eggs : ఈ గుడ్డు ను ఎప్పుడైనా తిన్నారా.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

Expensive Eggs : గుడ్డు అంటే అందరికీ తెలిసిందే. రోజు ఒక గుడ్డు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ ని ఎన్నో రకాల పోషకాలను గుడ్డు అందజేస్తుంది. వీటి ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. గుడ్డులో క్యాల్షియం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రపంచంలో ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయి. అవి కోడిగుడ్డు మాత్రం కావు. మరి ఎటువంటి గుడ్లు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గుడ్లు అన్నింటిలోకెల్లా ఈము గుడ్లు అత్యంత ఖరీదైనవి. ఇవి గోధుమ వర్ణాన్ని కలిగి చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తాయి. ఈము గుడ్డు మన సాధారణ గుడ్లతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఈ ము గుడ్డుతో ఆమ్లెట్ వేస్తే రుచి అదిరిపోతుందట. ఈ ఒక్క ఆమ్లెట్ తో కడుపు నిండి భోజనం తిన్న ఫీలింగ్ ఉంటుందంట. రుచి ,సైజు లాగానే రేటు కూడా అదిరిపోతుంది. ఒక్క గుడ్డు ధర రెండు కిలోలు మటన్ ధరతో పాటు సమానంగా ఉంటుంది.గల్ గుడ్డు వీటిని మనం ఎప్పుడు చూసి ఉండము. కానీ బ్రిటిష్ దేశంలో అధికంగా లభిస్తాయి. దీని రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.

Advertisement

Expensive Eggs : ఈ గుడ్డు ను ఎప్పుడైనా తిన్నారా.. దీని ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

health benefits of these Expensive eggs
health benefits of these Expensive eggs

ఏడాది మొత్తంలో రెండు నెలల మాత్రమే లభిస్తాయి. అందుకే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. దీని ధర దాదాపు 500 నుండి 800 వరకు ఉంటుంది. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.పిట్ట గుడ్డు లాగానే చిన్న చిన్నగా గుండ్రంగా ఉంటాయి. ఈ గుడ్లు చిన్నగా ఉన్న ఖరీదు మాత్రం అధికంగానే ఉంటుంది. ఈ గుడ్డుని ఆమ్లెట్ రూపంలో కన్నా ఉడికించుకొని తింటేనే శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. అలాగే బాతు గుడ్లు మనకు అందుబాటులోనే ఉంటాయి. ఇవి కోడిగుడ్లు కంటే కొంచెం పెద్ద సైజు లోనే ఉంటాయి. బాతు గుడ్లలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Advertisement