Health : జీడిపప్పుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో ద్రోహత పడతాయి. అలాగే రక్తపోటును అదుపులో ఉంచి గుండె సంబంధిత జబ్బులను దూరం చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందజేయడంలో ఎంతో సహాయపడతాయి. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని ముందే అరికడతాయి. అంతేకాదు ఇవి అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. జీడిపప్పులు బరువును తగ్గించడంలో ఎంతో బాగా సహాయపడతాయి. జీడిపప్పు లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు. వివిధ రకాల వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి.
జీడిపప్పులు జుట్టు చర్మానికి పోషణను కూడా అందజేస్తాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. జీడిపప్పులు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనివల్ల కొన్ని దుష్పవాలు కూడా కలుగుతాయి. జీడిపప్పులు తరచుగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు జీడిపప్పులను తినడం మానేయాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలైట్ ఉంటుంది. యాక్సిడెంట్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం శోషనకు దారితీస్తుంది.
Health : జీడిపప్పులు ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తింటున్నారా..?

అలాగే మూత్రపిండ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి జీడిపప్పులు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కడుపునొప్పి వికారం నోరు వాపు లేదా ఆహారం మింగడానికి కష్టంగా ఉంటుంది. అలర్జీ సమస్యలు ఉన్నవారు జీడిపప్పును ఎక్కువగా తింటే, దగ్గు వంటి సమస్యలు కలగవచ్చు. ఇటువంటి వారు జీడిపప్పులకి దూరంగా ఉండాలి. జీడిపప్పులను అధికంగా తినడం వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి. ఇలానే జీడిపప్పులను మాత్రమే తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్పడం లేదు. ఇటువంటి సమస్యలు ఉన్నవారు మాత్రమే ఈ పప్పులు కి దూరంగా ఉండాలి.
అయితే జీడిపప్పులను రెండు మార్గాల ద్వారా తింటే ఎటువంటి సమస్యలు తలెత్తవు. జీడిపప్పులతో పాలు తయారు చేసుకుని తాగవచ్చు. దీనికోసం ఒక కప్పు జీడిపప్పును తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ ని కలిపి గ్రైండ్ చేసుకొని వడగట్టి తాగటం మంచిది. లేదంటే రెండు కప్పుల జీడిపప్పులు తీసుకుని ఒక కప్పు కొబ్బరి నూనె, చిటికెడు ఉప్పుని తీసుకోండి. ముందుగా జీడిపప్పులు వేయించి ఆ తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకొని దీనికి తేనెను కలిపి తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలైన దూరమవుతాయి.