Benefits of Ginger Tea : ప్రాచీన కాలం నుండి అల్లానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మూలికా వైద్యంలో అల్లం రసాన్ని ఉపయోగించి, ఎన్నో రకాల మందులు తయారు చేస్తుంటారు. అలాంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాంటి అల్లం టీ తాగడం వల్ల శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఇది అధిక బిపిని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాలను తగ్గించి ,మంచి కొలెస్ట్రాలను పెంపొందిస్తుంది. గుండె జబ్బులను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లం టీ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. మనం మితంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెద్దగా పెరగదు. ఆహార పదార్థాలను జీర్ణం చేయడంలో చురుకైన పాత్ర వహిస్తుంది. జలుబు, దగ్గు ,ఆస్తమాలను కూడా నయం చేయగలదు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అల్లం, నిమ్మ రసాన్ని కలిపి సేవిస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. నిజానికి అల్లం సహజ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
Benefits of Ginger Tea : అల్లం టీ తో ఆరోగ్య చిట్కాలు.. అవి ఎలాగంటే.

జలుబు ,దగ్గు ,జ్వరం వంటి వ్యాధులతో బాధపడేవారు అల్లం తీసుకోవడం చాలా ఉత్తమం. అంతేకాకుండా గొంతులో గరగర ,నొప్పి బొంగర పోవడం వంటి సమస్యలకి పచ్చి అల్లం ముక్కలను నమలడం మంచిది. తలనొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే అల్లం టీ అలాంటి తాగడం వల్ల ఆ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం రసం చెవిలో పోటు తగ్గిస్తుంది. అలాగే కీళ్ల వద్ద మద్దన చేస్తే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం లో యాంటీ వైరల్ ,యాంటీ ఫంగల్ గుణాలు ఉండి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. అల్లం టీ తాగడం వల్ల ఫ్లూ ,జరాన్ని, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది