Back Pain : ఈ రోజుల్లో చాలామందిలో ఎన్ని నొప్పి సమస్యలు అధికమవుతున్నాయి. విశ్రాంతి లేకుండా పని చేయడం, రోజంతా కంప్యూటర్ ముందు పని చేయడం వల్ల వెన్ను నొప్పికి ప్రధాన కారణాలు. ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలామంది అనేక మందులు వాడుతారు. అయితే వీటివల్ల తాత్కాలిక ఉపశమనం దొరుకుతుంది కానీ ఎక్కువ రోజులు మందులు వాడితే భవిష్యత్తులో మరిన్ని రోగాలు సమస్యలు వస్తాయి. అందుకే కొన్ని ఇంటి చిట్కాలు పాటించమంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం. వెల్లుల్లి ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు వెన్ను నొప్పిని దూరం చేస్తాయి.
ఇందుకోసం కొద్దిగా ఆవాల నూనెను తీసుకొని వేడి చేసిన తర్వాత, అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కాల్చిన తరువాత నునే ను దించి కాస్త చల్లార్చాలి. ఆ తరువాత ఈ నూనెతో నడుముపై మర్దన చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పసుపులో అధికంగా ఉంటాయి. ఇవి ఒళ్ళు నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. వెన్ను నొప్పి సమస్య అధికమైనట్లయితే రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగండి. దీంతో వెన్ను నొప్పులు సమస్యలు తలెత్తవు.
Back Pain : వెన్ను నొప్పి ఇంటి చిట్కాలతో ఉపశమనం

మగవారి వెన్ను నొప్పిని తగ్గించడానికి కొబ్బరి నూనె, కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక పాత్రలో కొబ్బరి నూనెను వేడి చేసి, దానిలో కొంచెం కర్పూరాన్ని వేసి. ఆ నూనె చల్లారిన తరువాత నొప్పి ఉన్నచోట మర్దన చేసుకోండి. ఇలా చేయడం వల్ల వెన్ను నొప్పి దూరమవుతుంది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల ఈ సమస్య కాస్త ఎక్కువ అవుతుంది. మధ్యలో కాస్త కుర్చీలో నుంచి లేసి అటు ఇటు నడవడం. బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా వ్యాయామం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది కూడా వెన్ను నొప్పికి దారితీస్తుంది.