Onion Tea : ప్రస్తుత కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా జీవనశైలి కారణంగా కొన్ని రకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. ఈ రోజుల్లో హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు, బీపీ వంటి వ్యాధులు సర్వసాధారణం అయిపోయింది. బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉంటే చిన్న వయసులోనే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఇతర గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి. అయితే ప్రతిరోజు ఒక కప్పు ఆనియన్ టీ తాగడం వల్ల బీపీని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆనియన్ టీ తయారీ వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Onion Tea : ఉల్లి టీ తో బీపీని కంట్రోల్ చేయవచ్చా….?
ఉల్లిలో ప్లేవనాయిడ్లు అనే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది అధిక రక్తపోటును నియంతరించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆహారంలో తప్పనిసరిగా ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల, దీనితో తయారుచేసిన టీ తాగటం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి టీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, లవంగాలు వెల్లుల్లి రెండు, తేనె ఒక టీ స్పూన్, నీళ్లు ఒకటి లేదా రెండు కప్పులు, బే ఆకులు ఎందుకు రెండు ఆనియన్ టీ తయారీ విధానం చూద్దాం.

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత బాగా మరిగిన నీటిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, బే ఆకులను వేసి బాగా ఉడికించాలి. నీటి రంగు మారిన తరువాత… నీటిని వడగట్టాలి. టేస్ట్ కు సరిపడా తేనె, దాల్చిన చెక్క పౌడర్ ని వేసి కలుపుకుంటే ఆనియన్ టీ రెడీ. ఈటీవీ రోజు పరగడుపున తాగడం వల్ల మీ శరీరానికి కావాల్సిన శక్తి లభించడమే కాకుండా బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
.