Coconut Water : చుండ్రు మరియు డ్రై హెయిర్ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా.? అయితే ఇలా చేశారంటే.

Coconut Water :  కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని సంగతి తెలిసిందే. అయితే ఈ కొబ్బరి నీళ్లు శరీరంలో ఉన్న వ్యాధులను దూరం చేయడమే కాకుండా… బాహ్య సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తాయి. అదేవిధంగా ముఖ సౌందర్యంతో పాటు జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది చుండ్రు, జుట్టు రాలే సమస్యలు, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలకు కొబ్బరి నీళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.

Advertisement

తాజాగా ఉన్న కొబ్బరి నీళ్ళని తీసుకొని జుట్టు మరియు తలపై బాగా మర్దన చేసినట్లయితే రక్తప్రసరణ జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు ను దృఢంగా చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తీసుకొని తలపై 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందగలరు. నిమ్మరసం కుదుర్లను బాగా ఉంచుతుంది.

Advertisement

Coconut Water : చుండ్రు మరియు డ్రై హెయిర్ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా.? అయితే ఇలా చేశారంటే.

If dandruff and dry hair problems are haunting you, then do this
If dandruff and dry hair problems are haunting you, then do this

అదేవిధంగా చుండ్రు, పింపుల్స్ ను దూరం చేయడంలో బాగా సహాయపడుతుంది. ఒక కప్పు కొబ్బరి నీళ్లలో ఒక టీ స్పూన్ నిమ్మ రసాన్ని కలిపి ఇలా కలిపిన మిశ్రమాన్ని తలపై బాగా మర్దన చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచిది. తేనె తలపై ఉన్న దురదని తొలగిస్తుంది. హాఫ్ కప్పు కొబ్బరి నీటిలో రెండు టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. ఆ తర్వాత ఈ రెండింటి మిశ్రమాన్ని తలపై బాగా మర్దన చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత మీ జుట్టుని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల ఈ సమస్య దూరం అవుతుంది

Advertisement