Chicken side Effects : ప్రస్తుత కాలంలో చాలామంది నాన్ వెజ్ పై ఆసక్తి చూపుతున్నారు. కొందరికి నాన్ వెజ్ లేనిది ముద్ద కూడా దిగదు. నాన్ వెజ్ ప్రియుల్లో… చికెన్ కున్న క్రేజ్ అంతా, కాదు.
చికెన్ తో చేసిన ఈ ఆహార పదార్థాలైన ఇష్టంగా తింటారు. చికెన్ ఫ్రై ,చికెన్ కర్రీ ,గ్రీన్ చికెన్ ,గోంగూర చికెన్ ,చికెన్ బిర్యాని… ఇలా రకరకాలుగా తింటూ ఉంటారు. మరికొందరు చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజు తింటారు. చికెన్ ప్రతిరోజు తినేవారు, దీనిలో మంచి ,చెడులను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చికెన్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.ఈ ప్రోటీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చికెన్ బ్రెస్టలో లూసిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు పెరగడానికి, డ్యామేజ్ అయిన కండరాలను.. బలం పెరగడానికి ఎంతో సహాయపడుతుంది.
కానీ చికెన్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చికెన్ కొనేటప్పుడు, ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరమని అంటున్నారు. చికెన్ ఎక్కువగా తింటే…. రక్తంలో చెడు కులెస్ట్రాలు స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో చేడు కొలస్ట్రాల స్థాయిలు పెరిగితే… గుండె సమస్యలు, హై బీపీ, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమస్యల నుండి దూరంగా ఉండాలంటే…. చికెన్ తక్కువగా తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు చికెన్ తింటే… త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే డైట్ కు, బరువుకు మధ్య తేడా ఉంటుంది. శాఖాహారులు కంటే నాన్ వెజ్ తినే వారి శరీర ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబంలో బీపీ వచ్చిన వారు ఉంటే…. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సంతృప్త కొవ్వు, ప్యా ట్ ఎక్కువగా ఉంటే ఆహారానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Chicken side Effects : చికెన్ ఇష్టమని ఎక్కువగా తింటున్నారా…..

డైరీ ఉత్పత్తులు, రెడ్ మీట్, చికెన్ స్కిన్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. మీ డైట్ లో ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.కొన్ని రకాల చికెన్లు తీసుకుంటే… మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ అధికంగా తింటే మూత్రనాళాల ఇన్ఫెక్షన్ తో పాటు మరికొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే చికెన్ ని తక్కువగా తీసుకోవాలి. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికమైతే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాలు నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల వాపు నొప్పులు, మూత్రపిండా సమస్యలు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్… మన శరీరం సహజంగా విస్తరించే వ్యర్థపదార్థాలలో ఇది కూడా ఒకటి. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది. అయితే విసర్జన సరిగా లేకపోతే యూరిక్ యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్పటికాలుగా మారి కీళ్ల చుట్టూ ఉండే కణజలాలలో పేరుకు పోతాయి. ఎక్కువగా చికెన్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడవలసి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు