Beauty Tips : చాలామంది తమ పెదవులు అందంగా కనపడాలని లిప్ స్టిక్ ని వేసుకుంటారు. కానీ లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల పెదవులు నల్లగా మారి, చిట్లిపోయినట్లుగా, డ్రై గా కనిపిస్తాయి. లిప్ స్టిక్ అతిగా వాడడం వల్ల పెదవులు రంగు నల్లబడుతుంది. లిప్ స్టిక్ వల్లనే కాకుండా చాలామంది పెదవులు సాధారణంగా నల్లగా కనిపిస్తాయి. అందుకు కారణం ప్రస్తుత కాలంలో జీవనశైలిలో ఏర్పరచుకున్న మార్పులు, వివిధ రకాల వ్యాధులు కూడా కారణం కావచ్చు. అలాగే ధూమపానం, మందులు, అలర్జీలు, జలుబు, విటమిన్ లోపం, రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గడం, ఇటువంటి కారణాలు వల్లనే ఈ సమస్యలు మొదలవుతాయి. నల్లటి పెదవులు సహజంగా ఎరుపు రంగులోకి రావాలంటే.
వివిధ రకాల స్క్రబ్ లు పెదవులపై ఉన్న డెత్ స్కిన్ ని తొలగించేందుకు బాగా సహాయపడతాయి. ఈ స్క్రబ్ తయారు చేసుకోవడానికి తేనే, బాదం నూనెను సమాన క్వాంటిటీలో తీసుకొని దానిలో కొంచెం షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి బాగా మర్దన చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పెదవులు మృదువుగా మారి లేత పింక్ కలర్ లో కనిపిస్తాయి. మన ముఖ చర్మానికి పోషణ ఎంత అవసరమో, పెదాలకు కూడా అంతే అవసరం. దీనికోసం రాత్రి పడుకునే ముందు పేదలకు అలోవెరా జెల్ రాసి బాగా మసాజ్ చేయాలి. ఆ తరువాత మార్చ్ రైజర్ క్రీమ్ ను అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు ఆరోగ్యంగా, అందంగా మెరిసిపోతాయి.
Beauty Tips : మీ పెదవులు ఎర్రగా లేత గులాబీ రంగులోకి మారాలంటే

రాత్రి పడుకునే ముందు పెదాలపై క్రీమ్ అప్లై చేయడం వల్ల పెదవుల రంగులో మార్పు వస్తుందని సౌందర్య నిపుణులు అంటున్నారు. నల్లగా మారిన పెదాలను లేత పింకు రంగులోకి మృదువుగా మార్చేస్తుంది. మరికొందరు వాటర్ సరిగా తాగకపోయినా పెదవులు రంగు నల్లగా మారిపోతుంది. తత్ఫలితంగా పెదవులు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తాయి. కాబట్టి రోజంతా డీహైడ్రేట్ గా ఉండడం వల్ల పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. కాబట్టి రోజు మొత్తంలో ఎక్కువ నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ధూమపానం చేసే వారి పెదవులు ఎప్పటికీ నల్లగా, డ్రై అయినట్లుగా కనిపిస్తాయి.