Custard Apple : ఎన్నో ఔషధ గుణాలతో, పోషక పదార్థాలతో దివ్య ఔషధపలంగా రూపొందిన అమృత ఫలం సీతాఫలం. డయాబెటి సమస్యలతో బాధపడేవారు సీతాఫల ఆకులను తీసుకొని వాటిని నీటిలో మరిగించి ఈ కషాయాన్ని ప్రతిరోజు పరగడుపున కొన్ని రోజులు పాటు తాగితే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. మన శరీరానికి కావలసిన శక్తిని బలాన్ని అందజేస్తుంది. ఆగస్టు_ నవంబర్ లో సీజనల్ గా దొరికే సీతాఫలం. సంవత్సరానికి ఒక్కసారైనా సీతాఫలాన్ని రుచి చూడాలని కోరుతూ ఉంటారు. సీతాఫలం అంటే ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు. సీతాఫలం అద్భుతమైన రుచితో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషిక విలువలు సమృద్ధిగా అందించడంలో కీలకపాత్ర వహిస్తాయి
. అలాగే సీతాఫలం మొక్కలోని ఆకులు, బెరడు, ఇలా ప్రతి భాగంలోనే ఎన్నో ఔషధాల గుణాలు కలిగి ఉన్నాయి. కనుక శరీరం ఆరోగ్యంగా దృఢంగా ఉంచుతుంది తేలిగ్గా జీర్ణం అవుతుంది. 100 గ్రాములు సీతాఫలం గుజ్జు నుండి 94 క్యాలరీల శక్తి, 25 గ్రాముల పిండిపదార్ధాలు లభిస్తాయి. ఆయుర్వేద చికిత్సలు సీతాఫలం ఆకులను, బెరడు, వేర్లను ఉపయోగించి డయాబెటిస్, గుండె జబ్బులు ,చర్మవ్యాధులు డయోరియా వంటి వ్యాధులకు చక్కటి పరిష్కారం చూపుతుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ పండుని తినవచ్చు.
Custard Apple : సీతాఫలంతో బోలెడు ప్రయోజనాలు.

దీన్ని తినడం వల్ల జలుబు వస్తుందని, దగ్గు ఆయాసం ఎక్కువ అవుతుందని కొందరు అపోహ. ఇది కేవలం ఆపోహే తప్ప నిజం కాదు! శరీరానికి వచ్చే ఎన్నో రోగాలను సీతాఫలాలు నయం చేస్తాయి. సీతాఫలం ఆకులు యాంటీ బ్యాక్ రియల్ యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉన్నాయి. కావున వీటిని ప్రతిరోజు కషాయం చేసుకుంటూ తాగితే సీజనల్ గా వచ్చే వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరియు ఆకులను ఫెస్టిగా చేసి గాయాలపై రాసినట్లయితే గాయాల త్వరగా మానం అవడంతో పాటు చర్మ సమస్యలు పెరుగుతాయి.
మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలాలు తింటే జీర్ణక్రియ మెరుగ్గా అవుతుంది. నోటిలో జీర్ణ రసాలు ఊరేలా చేసే గుణం ఈ పండుకు ఉంటుంది. జలుబు, దగ్గు ఆయాసంతో బాధపడేవారు ఈ పంటను పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. డయాబెటిస్ రోగులు సీతాఫలాన్ని తినకపోవడం మంచిది. ఎందుకంటే దీనిలో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో సీతాఫలాలు తినకూడదని ఇప్పుడు చూసి ఇస్తున్నారు. సీతాఫలం ఆకుల నుండి తీసిన రసంతో తలకు మద్యం చేస్తే, తలనొప్పి వెంటనే తగ్గుతుంది. సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడి చేసి తలకు బాగా పట్టించాక మూడు గంటలుకు స్నానం చేస్తే చుండ్రు మటుమాయం అవుతుంది