Gummadikaya Benefits : గుమ్మడికాయ తో వంటలు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందజేస్తాయి. గుమ్మడికాయ తో చేసే స్వీట్లు చాలా రుచిగా ఉంటాయి. గుమ్మడికాయని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. గుమ్మడి కాయ ,బెల్లం, కొబ్బరి పాలు తో చేసుకునే పాయసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాయసాన్ని తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఇందులో చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడంతో ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. గుమ్మడికాయ పాయసం తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
బాగా పండిన గుమ్మడికాయ పావుకిలో, ఆఫ్ కప్పు పెసరపప్పు, పావు లీటర్ కొబ్బరి పాలు, పావు కిలో బెల్లం, ఒక్క టేబుల్ స్పూన్ జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ బాదం తురుము, అర స్పూన్ ఏలకుల పొడి. ముందుగా పెసరపప్పుని బాగా శుభ్రం చేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ముప్పావు లీటర్ నీళ్లుని బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేడి నీటిలో ఉడికించాలి. పెసరపప్పుని కొంచెం పలుకులు ఉండేలా ఉడికించాలి.
Gummadikaya Benefits : గుమ్మడికాయ పాయసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. దీన్ని ఎలా చేయాలంటే.

పెసరపప్పు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత గుమ్మడి ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత గుమ్మడి ముక్కలు కూడా పూర్తిగా విడిపోయిన ఉడికిపోయిన తర్వాత ఈ మిశ్రమం కాస్త చిక్కగా పడిన తర్వాత కొబ్బరి పాలు వేసి లో ఫ్లేమ్ లో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకొని అందులో బెల్లం రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి మరిగించుకోవాలి. బెల్లం కాస్త మరిగి పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
ఇలా తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని పెసరపప్పు గుమ్మడికాయ మిశ్రమంలో వేసి తక్కువ మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఉడికి చిక్కబడే సమయంలో నెయ్యి ,జీడిపప్పు ,బాదం పలుకులు ,యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే గుమ్మడికాయ పాయసం రెడీ. ఈ పాయసంలో చక్కెర బదులు బెల్లాన్ని ఉపయోగిస్తున్నాము కనుక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.