Beauty Tips : బియ్యం పిండితో వంటలు చేసుకోవడం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు

Beauty Tips : మొదటిగా బియ్యం పిండితో చేసుకునే వంటలు బియ్యం రొట్టె, తపాలచెక్క, కారం రొట్టె,కార పప్పలు, చిన్నపిల్లలకు స్నాక్స్లాగా పిండితో కారం ఉప్పు వేసి మురుకులు కూడా చేసుకోవచ్చు బియ్యం పిండితో అప్పటికప్పుడు టిఫిన్ కూడా చేసుకోవచ్చును . బియ్యం పిండితో వడియాలు కూడా చేసుకోవచ్చు . ఉప్మాకి లాగే అన్ని ప్రిపేర్ చేసుకొని ఉప్మా రవ్వ కి బదులుగా బియ్యంపిండి వేసుకొని చేసుకోవాలి.అంతే టేస్టీ హెల్దీ టిఫిన్ తయారవుతుంది.అంతే బియ్యంపిండితొ ఉప్మా రెడీ అవుతోంది.ఇలా బియ్యం పిండితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు .రెండవది బియ్యం పిండితో ముఖం కాంతి సౌందర్యం పెంచుకోవడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మాయిలు అందంగా కనిపించటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

అమ్మాయిలు అందరూ అందంగా కనిపించటానికి పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో వేలల్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు .పేద, మధ్యతరగతి, ధనిక ,అనే తేడా లేకుండా అందరి దృష్టీ అందంగా కనిపించడంలోనూ బిజీ అవుతున్నారు.అయితే ఇలాంటి పరిస్థితులలో ఇంట్లోనే ఈజీగ దొరికే బియ్యం పిండితో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం ఎలాగో మీకోసం.ముందుగా బియ్యం పిండిని ఒక గిన్నెలో కొంచెం తీసుకోవాలి, దాంట్లో పుల్లటి పెరుగు వేసుకుని ప్యాక్ లాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని ఫేస్కి పేస్ప్యాక్లాగా అప్లై చేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకొని తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి తర్వాత చూసుకోండి మీ ముఖంలో ఎంతో మార్పు కనిపిస్తుందో. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

Advertisement

Beauty Tips : బియ్యం పిండితో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు

skincare with rice floor
skincare with rice floor

బియ్యంపిండి, పెరుగు కలిపి వేసుకున్న ఈ ప్యాక్ వలన ముఖం చాలా కాంతిగా మృదువుగా తయారవుతుంది .ఈ ప్యాక్ ని ఎండాకాలంలో వారానికి రెండుసార్లు వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వలన ముఖంపై ఉన్న ట్యాన్ పోతుంది. ఎండాకాలంలో తక్షణ రిలీఫ్ దొరుకుతుంది .బియ్యం పిండితో ఇంకో రెమిడీ ముందుగా బియ్యం పిండిని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లో కొంచెం శెనగపిండి వేసుకొని ప్యాక్ బాగా మిక్స్ చేసుకోవాలి, దాంట్లో వాటర్ అయినా రోజ్వాటర్ అయినా వేసుకొని ప్యాక్ ని మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారుచేసిన ప్యాక్ని ఒక అరగంటసేపు ముఖానికి వేసుకొనే ఉంచుకోవాలి తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి ఇలా చేయడం వల్ల ముఖంలో చాలా కాంతి కనపడుతుంది.

ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు వేసుకోవచ్చు .బియ్యం పిండితో ఇంకొక రెమెడీ బియ్యంపిండిలో కొద్దిగా టొమాటో రసం, పచ్చిపాలు వేసుకొని ప్యాక్లా తయారుచేసుకోవాలి ,ఇలా తయారుచేసుకున్న ప్యాక్ ని ఫేస్ కి అప్లై చేసుకుని ఒక ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి ఈ ప్యాక్ వలన కూడా ముఖంలో చాలా మార్పులు కనిపిస్తాయి. ఇలా బియ్యం పిండితో ఎన్నో రకాలుగా మనం ఇంట్లోనే ఫేస్ప్యాక్లు చేసుకొని వాడొచ్చు .ఎటువంటి ఖర్చులేకుండా న్యాచురల్ ఇంగ్రీడియన్స్ తో ఇలా ప్యాకులు చేసుకొని వాడటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది .తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.

Advertisement