Bread Bajji : వేడి వేడిగా తింటే, ఎంతో రుచిగా ఉండే, పంజాబీ స్టైల్ బ్రెడ్ బజ్జీ ని తయారుచేసుకోవడం ఎలానో మీ అందరి కోసం….కావలసిన పదార్థాలు శనగపిండి, పుదీనా, ఉప్పు, కారం, డీప్ ఫ్రైకి సరిపడా నూనె, చిల్లిపౌడరు,సోడా ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, కుకింగ్ సోడా, జీలకర్ర బ్రెడ్,కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు. బ్రెడ్ బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా బజ్జీలు వేసుకోవడానికి ఒక బౌల్లో శెనగపిండి తీసుకోవాలి. దాంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కారం, గరంమసాలా, సాల్ట్, పసుపు, అల్లం, చాట్‌మసాలా, పసుపు,సోడా ఉప్పు, వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా బజ్జీలు వేసుకునేలాగా చిక్కగా కలుపుకోవాలి.
Bread Bajji : ఎంతో రుచికరమైన బ్రెడ్ బజ్జీని చేసుకోవడం మీలో ఎంతమందికి తెలుసు?
ఎక్కువ నీరు పోసుకోకూడదు.తర్వాత ఒక మిక్సీ జారులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, మూడునాలుగు పచ్చిమిర్చి, కొంచెం పెరుగు, జిలకర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ ఫైను గా చేసుకున్న పేస్టుని బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఎడ్జెస్ట్ కట్ చేసుకొని పెట్టుకోవాలి.తర్వాత బ్రెడ్ ని ట్రయాంగిల్లో కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లయిసెస్‌ను కట్ చేసుకొన తర్వాత, పుదీన పేస్టుని బ్రెడ్ పైన అప్లై చేసుకునే ఒకదానిమీద ఇంకొక బ్రెడ్ పెట్టుకోవాలి.అలా మనకి ఎన్నో బ్రెడ్లు కావాలంటే అన్నింటిని తయారు చేసుకుని పెట్టుకోవాలి.
డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని నూనె బాగా కాగిన తరవాత బ్రెడ్ స్లయిసెస్‌ను శెనగపిండిలో ముంచుకొని బజ్జీలలాగా వేసుకోవాలి. రెండు బ్రెడ్‌స్లైసుల్ని మంచిగా జాగ్రత్తగా పట్టుకొని శనగపిండిలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేసుకొని బజ్జీలలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బ్రెడ్ బజ్జీలు తయారవుతాయి. ఈ బ్రెడ్ బజ్జీ లొకి మనం చెట్నీతో తినొచ్చు. టమాటో కెచప్ తొ తినొచ్చు. ఎలాగైనా సరే వేడి వేడిగా తింటే చాలా రుచికరంగా ఉంటాయి.ఎప్పుడూ ఒకే లాగా కాకుండా పిల్లలకి ఈ విధంగా బ్రెడ్‌తో భజ్జీ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు.ఈ బ్రెడ్ బజ్జీలో మనం వాడే పదార్ధాలన్నీ ఆరోగ్యానికి మంచివే కాబట్టి పిల్లలకి ఆరోగ్యానికి కూడా సహకరిస్తుంది.