Hot bath : మీరు వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా….. అయితే ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకోండి.

Hot bath : రోజు ప్రతి ఒక్కరు స్నానం చేస్తారు. అయితే కొందరు చల్లటి నీటితోటి ,మరికొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. స్థానం చేయడం అనేది మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ముఖ్యమైనది. అయితే వేడి నీళ్ల స్థానం చల్లటి నీల స్థానం ఈ రెండిటిలో మన శరీరానికి ఏది మంచిదో తెలుసుకుందాం.
చల్లటి నీటితో స్నానం కంటే వేడి నీటితో స్నానం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటి స్థానం వల్ల ఒంటి నొప్పులు తగ్గి ఉపశమనంగా అనిపిస్తుందని వెల్లడిస్తున్నారు. అధికంగా అలసటకు గురి అయినప్పుడు వేడి వేడి నీటితో స్నానం చేస్తే రిలీఫ్ గా ఉంటుంది. వేడి నీటితో స్నానం చేస్తే శరీరంలో ఉన్న క్యాలరీలు కరుగుతాయట. మనం బాగా నడవడం వల్ల క్యాలరీలు కరిగినట్లుగానే వేడినీటితో క్యాలరీలు కరుగుతాయి. లౌబరో యూనివర్సిటీకి చెందిన కొందరు వ్యక్తులు పరిశోధనలు చేశారు.

Advertisement

సాధారణంగా శరీర టెంపరేచర్ ని ఒక డిగ్రీ సెల్సియస్ వరకు పెంచితే శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో గమనించారు. 104 డిగ్రీల ఫారిన్ హీట్ కి ఒక గంట స్థానం చేశారు. దీంతో పాటు వారు ఒక గంట పాటు సైకిల్ తొక్కారు. ఈ రెండింటిలో పెద్దగా తేడా లేనట్లుగా గుర్తించారు. స్థానం చేసిన వ్యక్తితో పోలిస్తే.. సైకిల్ తొక్కేటప్పుడు ఎక్కువ క్యాలరీలు కరిగిపోయాయి. అయితే వేడి నీటితో ఒక గంట సేపు స్నానం చేయడం వల్ల 130 క్యాలరీలు కరిగిపోతాయని పరిశోధనలు కనుగొన్నారు. ఇది 30 నిమిషాల పాటు నడకకి సమానం. ఈ ప్రక్రియలో స్థానంలో కేలరీలను కరిగించడాన్ని పాసివ్ హిటింగ్ అంటారు.

Advertisement

Hot bath :  అయితే ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకోండి.

These are the benefits of taking hot water bath
These are the benefits of taking hot water bath

వ్యాయామం ద్వారా కాకుండా వేడి మరియు తేమతో కూడిన వాతావరణం మీకు కష్టపడకుండా చమట పట్టేలా చేసినప్పుడు పాసివ్ హీటింగ్ జరుగుతుంది. హీట్ షాక్ ప్రోటీన్ల వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రోటీన్లు వ్యాయామం చేసే సమయంలో, వ్యాయామం లేకుండా శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పాసివ్ హీటింగ్ లో ఉత్పత్తి అవుతాయి. చమట పట్టడం వల్ల మీరు కోల్పోయే బరువులో ఎక్కువ భాగం నీటి బరువు ఉంటుందని గమనించాలి. అయితే దీనివల్ల బాడీ డీహై డ్రైషన్ కి గురి చేస్తుంది. శరీరంలో నీరు తగ్గితే తల తిరగడం మొదలవుతుంది. డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే దాహం వెయ్యకపోయినా తరచుగా నీటిని తాగుతూ ఉండాలి.

అలాగే వ్యాయామం చేసినప్పుడు, మీ ఒంట్లో అధికంగా చెమట పట్టడం కంటే కదలికల నుండి చాలా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. శరీరం నుండి చెమట పట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కిడ్నీలలో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పింపుల్స్ ని తగ్గిస్తుంది. దగ్గు ,జలుబు ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. నాడీ వ్యవస్థ విశ్రాంతి లభిస్తుంది. కండరాల నొప్పి, వాపు వంటివి తగ్గుతాయి. అలాగే ఆందోళన కూడా తగ్గుతుంది. వేడినీటి స్థానం స్థానంతో అలసట తగ్గుతుందని పలు పరిశోధనలో వెల్లడైంది. ఇలాంటివి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. ఆ సట నుండి ఉపశమనం ద్వారా వచ్చే నిద్ర గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా వేడి నీటిని స్థానం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది

Advertisement