Health Benefits : కడుపుబ్బరం తగ్గాలంటే ఇవి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.

Health Benefits : ప్రస్తుత కాలంలో జీర్ణవ్యవస్థ సమస్యలు ఎక్కువవుతున్నాయి. తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాకపోవడం వల్ల పొట్ట ఉబ్బరంగా, గట్టిగా రాయి లాగా తయారవుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండడం, ఆకలి తక్కువగా వేయడం, మలబద్ధకం వంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఇవి పొట్ట, జీర్ణ క్రియకు సంబంధిత సమస్యలు. ఈ సమస్యలతో చాలామంది సతమతమవుతున్నారు. ఈ సమస్యలు చాలా రకాలుగా ఉన్నాయి. మీ పొట్టలో యాసిడ్స్ తక్కువగా ఉండడం వల్ల ఏర్పడుతుంది.మన శరీరం తిన్న ఆహారం నుండి మినరల్స్, విటమిన్స్ ని గ్రహించుకోవాలంటే.. గ్యాస్ట్రిక్ యాసిడ్ అవసరం. పొట్టలో ఈ యాసిడ్ ఎక్కువైనా ,తక్కువైనా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

పొట్టలో యాసిడ్ తక్కువగా ఉంటే ఎస్ఐబి ఓ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొట్టలో యాసిడ్ తక్కువగా ఉండటానికి కారణం ఒత్తిడి ,చెడు ఆహారపు అలవాట్లు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిదని పోషకాహార నిపుణులు తెలియజేశారు. జింక్ లోపం ,వయసు పెరగడం ,మందులు ,ఇన్ఫెక్షన్లు, షుగరు ఎక్కువగా తీసుకోవడం వంటి సమస్యలు కడుపులో ఆసిడ్ ఉత్పత్తి తక్కువగా తయారవడానికి కారణాలు. పొట్టలో యాసిడ్ తక్కువగా ఉంటే.. ఈ లక్షణాలు కనిపిస్తాయి.కడుపులో వికారం ,తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాకపోవడం, పోషకాహార లోపాలు. 100 గ్రాముల అరుగాలా ఆకుల్లో 91.71 గ్రాముల నీరు లో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ గట్టి పొట్ట ఇతర జీర్ణ అవయవాలుకు మేలు చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే.. పెద్దప్రేగు క్యాన్సర్, అల్సరేటివ్ కొలిటీ స్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

Advertisement

Health Benefits : కడుపుబ్బరం తగ్గాలంటే ఇవి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.

these must be taken to reduce stomach ache

రోజు పరిగడుపున వెల్లుల్లి తినడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. తరచుగా పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండెలో మంట ,కడుపునొప్పి ,ఉబ్బరం ,యాసిడిటీ వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. రోజు ఆహార పదార్థాలతో పాటు అల్లం తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు దరి చేరవు. అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కొద్దిగా ఉపసమనం కలగజేస్తాయి. కొబ్బరిలో యాంటీ ఇన్ఫెక్షన్, క్రిమినాశక లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పొట్టలో వికారం వంటి సమస్యలను తగ్గించడంలో కొబ్బరి ఎంతో సహాయపడుతుంది. కోకో ఎన్నో రకాల జీర్ణవ్యవస్థ సమస్యలను తగ్గిస్తుందని వైద్యులు తెలియజేశారు. దీనిలో ఫ్లవనాయిడ్ల ను అధికంగా ఉంటాయి. అందువల్ల విరోచనాలు, జీర్ణ సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది.

Advertisement