Vastu tips : ఇంట్లో ఐశ్వర్యం ప్రాప్తించాలంటే… ఈ నియమాలను పాటించండి.

Vastu tips : ఎవరైనా సరే తమ ఇంటిని నిర్మించుకునేటప్పుడు వాస్తు ప్రకారంగా నిర్మించుకోవాలి. అలా కట్టకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. దాని కారణంగా కుటుంబ సభ్యులు మానసికంగాను, శారీరకంగాను అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా, మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మీ సంపదపై చెడు ప్రభావం పడుతుంది. మీరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాగే అనేక అనారోగ్య సమస్యలు మీ ఇంటిని చుట్టుముడుతాయి.

Advertisement

అలాగే వాస్తు ప్రకారం గా ఇంటినే కాదు ఇంట్లోనే వస్తువులు కూడా వాస్తు ప్రకారం గా అమర్చుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రపరుస్తూ ఉండాలి. అయితే కొన్ని వాస్తు దోషాలను సులువైన చర్యలతో తొలగించుకోవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సంపద నిలవాలంటే ముఖ్యంగా ఈ పరిహారాలను పాటించాలి. వీటిని పాటిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది. అయితే ఇప్పుడు ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.. మీ ఇంటికి ఈశాన్య దిశలో చెత్త లేదా బరువైన వస్తువులను ఉంచకూడదు. దీని వలన మీ ఇంటికి వాస్తు దోషం కలుగుతుంది.

Advertisement

Vastu tips :ఇంట్లో ఐశ్వర్యం ప్రాప్తించాలంటే… ఈ నియమాలను పాటించండి.

Vastu tips this remedies for home
Vastu tips this remedies for home

ఎప్పుడైనా సరే మీ ఇంటి ఈశాన్య దిక్కును శుభ్రంగా ఉంచాలి. ఇలా ఉంచడం వలన ఇంట్లో శాంతి మరియు సంతోషం నెలకొంటాయి. అలాగే ఇంటికి ఉత్తర దిశలో పచ్చని మొక్కలను పెంచాలి. అలాగే ఆగ్నేయ దిశలో ఎర్రటి గుర్రపు జంటల చిత్రాన్ని ఉంచడం ద్వారా మీ సంపద పెరుగుతుంది. స్ఫటిక శ్రీ యంత్రాన్ని మీ ఇంటిలోని ఈశాన్య దిక్కులో అమర్చండి. ఇలా చేస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ సంపద కూడా పెరుగుతుంది. అలాగే మీరు సంపాదించిన డబ్బు నిలుస్తుంది.మీ ఇంట్లో వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ యంత్రాన్ని ఇంట్లో ఉంచడం వలన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు రావు. ఈ యంత్రం వలన మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యల బారిన పడకుండా ఈ యంత్రం రక్షిస్తుంది.మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నట్లు అనిపిస్తే మీరు మీ ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేశాక కొన్ని నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఆ పసుపు నీళ్లను ఇల్లంతా చల్లుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే మీ ఇంటి కిటికీలు ఎల్లప్పుడు మూసి ఉంచకూడదు. ఇలా మూసి ఉంచితే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడి ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. అందుకని ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు కిటికీలను, తలుపులను తెరచి ఉంచాలి.

ఇలా ఉంచడం వలన ఇంట్లోని చెడు శక్తులు పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంటికి కలుగుతుంది. అలాగే పూజ గదిలో దేవుడికి సమర్పించిన పాత పూలు, పండ్లు లేదా ఇతర పూజ సామాగ్రిని ఉంచవద్దు. ఇలా ఉంచితే వాస్తు దోషం కలుగుతుంది. ప్రతిరోజు పూజ గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నిలుస్తుంది. ఒకవేళ మీకు మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లుగా అనిపిస్తే పూజ చేసేటప్పుడు శంఖం ఊదాలి లేదా గంటను అయినా కొట్టాలి ఇలా చేసే వాస్తు దోషాలు మరియు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రెండు తొలగిపోతాయి.

Advertisement