Custard Apple : ప్రస్తుతం సీతాఫలం సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో సీతాఫలాల సందడి విపరీతంగా సాగుతోంది. అయితే అమృతంలా అనిపించే ఈ పండును తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. చిన్న నుండి పెద్ద వరకు చాలామంది ఈ పండుగ ఇష్టపడతారు. ఇక ఈ పండు రుచికి మాత్రమే కాకుండా పోషకాలలో కూడా ముందుంటుంది. దీనిలో సి విటమిన్ తో పాటు విటమిన్ ఏ ,బి, కే , మరియు ఫాస్ఫరస్ ,మెగ్నీషియం, ఐరన్ ,పొటాషియం వంటి పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ సీతాఫలాన్ని తినడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.ఇది మన శరీరానికి చలువ చేయడంతో పాటు రక్తహీనత గుండె జబ్బులు వంటి వాటి నుండి కూడా రక్షిస్తుంది.అయితే కొన్ని దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారు మాత్రం దీనిని తినడానికి సందేహిస్తూఉంటారు. మరి అలాంటి అనుమానాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
షుగర్ పేషెంట్స్ తినవచ్చా….
సీతాఫలం అనేది చాలా మధురంగా ఉండే పండ్ల లో ఒకటి. దీని కారణంగానే షుగర్ పేషెంట్స్ సీతాఫలం తినాలంటే వెనకడుగు వేస్తుంటారు. అయితే సీతాఫలంలో మాత్రం లైసెన్స్ ఇండెక్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కావున మధుమేహ సమస్యతో బాధపడేవారు నిశ్చింతగా సీతాఫలాన్ని ఆస్వాదించవచ్చు. కానీ వీలైనంతవరకే తీసుకోవాలని అమితంగా తీసుకున్నట్లయితే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు పెరుగుతారా…?
సీతాఫలం తినడం వలన బరువు పెరుగుతారనే అపోహ చాలా మందికి ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక సీతాఫలంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే సీతాఫలం తిన్నప్పుడు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండేందుకు దోహధపడుతుంది. ఈ క్రమంగా బరువు కూడా తగ్గవచ్చు. కావున సీతాఫలం బరువు తగ్గిస్తుంది కానీ బరువు పెంచేందుకు తోడ్పడదని అర్థమవుతుంది.
గుండె సమస్యలు ఉంటే….
శరీరంలో మెగ్నీషియం లోపించినట్లయితే గుండెపై ప్రతికూల ప్రభావం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మెగ్నీషియం సమృద్ధిగా కలిగి ఉన్న సీతాఫలం తినడం వలన శరీరానికి మేలు జరుగుతుంది. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గమనిక : పైన పేర్కొనబడిన అంశం ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా రూపొందించాం.ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.