Skin Care Tips : చాలామంది ముఖం పైన ఉన్న మొటిమలు, మచ్చలు మరియు మెరిసిపోవడానికి ఎన్నో రకాల క్రీమ్లను రాస్తూ ఉంటారు. అయితే చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వారికి నిమ్మ రసంతో ఈ సమస్యలకు బెస్ట్ టిప్.. అయితే దీనిని ఎలా వాడాలి? దీనివలన కలిగే లాభాలేంటి మనం ఎప్పుడు తెలుసుకుందాం.కొన్ని సమస్యలకు చిన్నపాటి టిప్స్ తోనే అద్భుతమైన రిజల్ట్ దొరుకుతుంది. వాటిలో ఒకటి ప్రధానంగా ముఖంపై మరకలు, మచ్చలు తొలగించడం కోసం అలాగే ముఖము మెరిసిపోవడం కోసం ఈ నిమ్మకాయ రసం చాలా సహాయపడుతుంది. ఈ నిమ్మకాయ తీసుకోవడం వలన మన శరీరానికి కావాల్సిన విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి నిమ్మకాయతో ఫేస్ మాస్క్ వేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
అయితే నిమ్మకాయ రసం ముఖంపై డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. ఇలా డైరెక్ట్ గా అప్లై చేయడం వలన చెడు ప్రభావాలు కలుగుతాయి. కావున ఫేస్ పై నిమ్మకాయ రసం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం..ముఖముపై ఉన్న మరకలు, మచ్చలు నివారించేందుకు నిమ్మకాయ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. వారంలో రెండు మూడు సార్లు దీనిని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నిమ్మరసంతో ముడతలు, సన్ టాన్ కూడా తగ్గిపోతాయి. అలాగే ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ నిమ్మకాయ చాలా ప్రయోజనకరంగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖంపై గ్లో కూడా వస్తుంది. ఈ నిమ్మకాయ రసం ఫేస్ కి అప్లై చేయడం వలన యాక్ని, పింపుల్స్ తొలగిపోతాయి.
Skin Care Tips : నిమ్మకాయ రసంతో లాభాలేంటి…

ఈ నిమ్మకాయ రసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండడం వలన, ఇటువంటి సమస్యలను తొలగిస్తాయి. అలాగే నిమ్మరసంతో కొబ్బరి నూనె లేదా ట్రీ ట్రీ ఆయిల్ కలిపి అప్లై చేయడం వలన పింపుల్స్ యక్ని కూడా తగ్గుతాయి.నిమ్మరసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఫేస్ పై నిమ్మరసాన్ని డైరెక్ట్ గా అప్లై చేయడం వలన దుష్ప్రభావాలు ని కలిగిస్తాయి. కాబట్టి ఎప్పుడూ నిమ్మరసాన్ని వీటితో కలిపి అప్లై చేసుకోవాలి. అవి ఒక స్పూన్ నిమ్మరసంలో, ఒక స్పూన్ కలమంద జ్యూస్ ను కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. లేదా కొబ్బరి నూనెతో కలిపి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి