curd at night : నైట్ పడుకునే ముందు పెరుగు తింటే మన శరీరం లో ఏం జరుగుతుంది.

curd at night : మనం రోజువారీ ఆహారం లో పెరుగు లేకుండా భోజనం పూర్తి కనట్లే భావిస్తారు. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రతి రోజు పెరుగు క్రమం తప్పకుండా పెరుగు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని మన పెద్దవాళ్ళు చెపుతూ ఉంటారు. అంతే కాక పెరుగులో జింక్, పొటాషియం, మెగ్నీషియం, పస్పరస్, విటమిన్ బి12 ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మన డైలీ మన ఆహారం చివర్లో పెరుగు తో పాటు కురని కానీ పచ్చడిని కానీ కలుపుకొని బాగా రుచిని ఆస్వాదిస్తూ ఉంటాం. ఈ విధంగా డైలీ తింటే కనుక జీర్ణక్రియ మెరుగుపడతుంది. అంతే కాక శరీరానికి కావలసిన జీర్ణ సమస్యలను అరికడుతుంది. పెరుగులో కాల్సియం అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు దృఢంగా అవుతాయి. పెరుగు మూత్ర వ్యాధులు రాకుండా యాంటి ఇన్ఫ్లమేరీ గా పని చేస్తుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా పెరుగు తీసుకుంటే క్రమంగా ఈ సమస్య తగ్గిపోతుంది.

Advertisement

పెరుగులో ఈస్ట్ ఉంటుంది కాబట్టి మన నోటిలోని పూతకు మెడిసిన్ ల పని చేసి త్వరగా ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారు మధ్యాహ్నం భోజనం లో పెరుగు క్రమం తప్పకుండా తీసుకుంటే కొంతవరకు వెయిట్ లాస్ అవుతారు. మన పేదవాళ్ళు పెరుగును మన ఆహారం లో అందుకే అంత ప్రాముఖ్యతను ఇచ్చారు. ఇది వంశ పారంపర్యంగా అందరూ ఆహారం లో భాగం గా చేసుకున్నారు. ఇంకో కోణం లో చూస్తే అతి ఏది అయిన ప్రమాదమే కాబట్టి పెరుగును మితంగా తీసుకుంటేనే మంచిది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
What happens in our body when we eat curd before going to bed at night
What happens in our body when we eat curd before going to bed at night

పెరుగును వంటలలో ముఖ్యంగా మంసాహారం వాడేటప్పుడు కొన్ని కూరల్లో కానీ వేడిచేసి ఉపయోగిస్తుంటారు. ఇలా చేయటం వల్ల పెరుగు విషం లా మారి మన జీర్ణ క్రియను దెబ్బతీస్తుంది అని వైద్యనిపుణులు చెపుతున్నారు. పెరుగును అధిక ఉస్నోగ్రత వద్ద వేడిచేస్తే దానిలోని ఔషధ గుణాలు నశించి విషం లా మారి మన ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా రాత్రి భోజనం చివరిలో చాలా మంది పెరుగును తింటారు. అయితే అలర్జీ మరియు ఊపిరి తిత్తుల ఇన్ఫెకషన్లు ఉన్నవారు పెరుగు రాత్రి తీసుకోవటం వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. తరచూ జలుబు దగ్గుతో బాధ పడేవారు నైట్ పెరుగును తీసుకోక పోవడం మంచిది అని విద్యానిపునులు సలహా ఇస్తున్నారు.

Advertisement