Health tips : మనిషి శరీరంలో అన్ని అవయవాలతో పాటు మూత్రపిండాలు ఒకటి. చెడు ఆహార పదార్థాలు , పానీయాలు వల్ల కిడ్నీలు తొందరగా పాడైపోతున్నాయి. అంతేకాకుండా అధిక బరువు వల్ల కూడా మూత్రపిండాలు దెబ్బతింటాయి. శరీరం నుండి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు మూత్రపిండాలు సహాయపడతాయి. మూత్రపిండాలు 80% పాడయ్యేవరకు బాగానే పనిచేస్తాయి. మూత్రపిండాలు దెబ్బ తింటానికి, ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.
రోజు తగినంత నీరు తీసుకోకపోవడంతో శరీరం డిహైడ్రేషన్ గురి అయ్యి కిడ్నీలకు కావలసినంత నీరు లభించినప్పుడు, అన్ని వ్యర్ధాలను తొలగించలేవు దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. శరీరానికి ఎండ తగలకపోవడంవల్ల కూడా ఈ సమస్య ఎదురవుతాయి. మార్నింగ్ ఎండలో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి శరీరాన్ని అందకపోతే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. కాబట్టి ఉదయం పూట ఎండ శరీరానికి ఎంతో అవసరం. తలనొప్పి , వివిధ రకాల నొప్పులకు చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు.
Health tips : ఇటువంటి ఆహార పదార్థాలు వల్లే మీ మూత్రపిండాలు డ్యామేజ్ అవుతున్నాయి.

ఈ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. సాల్ట్ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు అత్యంత ప్రమాదకరమైనది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే హైబీపీ వస్తుంది. ఇది కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాక గుండె జబ్బులు, స్ట్రోక్ కు దారితీస్తుంది.ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు లీటర్లు నీటిని తీసుకోవాలి. అంతేకాకుండా ధూమపానం ,గుట్కా ,సిగరెట్ లాంటివి చేయకూడదు. ఉదయం ఎండలో ఐదు నిమిషాలు ఉండాలి. పెయిన్ కిల్లర్స్ ని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది.