Five Beautiful Beaches : మీకు గోవాలా అనిపించే 5 అందమైన బీచ్ లు .. ఎక్కడున్నాయంటే ..?

Five Beautiful Beaches ; ప్రస్తుతం వేసవికాలం మండుటెండలతో జనాలను హీటెక్కిస్తోంది. ఈ ఎండల నుంచి తప్పించుకోవడానికి చాలామంది బీచ్లకు వెళుతూ ఉంటారు. మన భారతదేశంలో గోవా బీచ్ చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడికి ఎంతోమంది వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి వెళుతుంటారు. అయితే అది అందరికీ సాధ్యమైనది కాదు. కొన్ని కారణాల వలన చాలామందికి గోవా వెళ్లడం సాధ్యం కాదు. దీనివలన అందమైన బీచ్ చూడాలని కల నెరవేరలేదు. అయితే ప్రసిద్ధ బీచ్ గోవాలో మాత్రమే లేదని మీకు తెలుసా. గోవా బీచ్ లా అనిపించే ఐదు అందమైన బీచ్లు మనదేశంలో ఉన్నాయి. ఈ బీచ్ లకు వెళ్ళామంటే అచ్చం గోవా బీచ్ కి వెళ్ళినట్లు గానే అనిపిస్తుంది.

Advertisement

1) ఓం బీచ్ : వేసవి సెలవులకు పర్ఫెక్ట్ బీచ్ ఈ ఓం బీచ్. ఇది ఆధ్యాత్మికంగా దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే దాని ఆకారం ఇలా ఉంటుంది. అక్కడి నుండి రెండు అర్థ చంద్రకారపు ముక్కలు ఒకదానికొకటి కలిసినట్లు కనిపిస్తాయి. కాబట్టి ఈ బీచ్ కూడా ఓం రూపంలో కనిపిస్తుంది. ఈ బీచ్ యొక్క వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Advertisement

2) కౌడియాల బీచ్ : గోవా లాంటి బీచ్ సందర్శించాలనుకుంటే రిషికేష్ కు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. కౌడియాల బీచ్ రిషికేష్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందమైన ప్రకృతి దృశ్యంతో కూడిన ఈ బీచ్ క్యాంపింగ్ కు ఉత్తమమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది కౌడియాల నుండి శివపురి వరకు ఉన్న రాప్టింగ్ జోన్ అద్భుతమైన ప్రదేశాలుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి దృశ్యాలు జీవితాంతం గుర్తిండిపోయేలా ఉంటాయి.

Best Beaches in India: Family-friendly Indian Beach Destinations

3) కోవలం బీచ్ : కేరళకు వెళ్లాలనుకుంటే కోవలం బీచ్ సరైనది. ఈ బీచ్ కేరళలోని అరేబియా సముద్రం మధ్యలో ఉంది. ఇక్కడ సముద్రపు అందమైన నీలిరంగు నీరు, ఎత్తైన తాడు చెట్లు, దాని ఒడ్డున ఎతైన రాళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ బీచ్ లో మరో మూడు చిన్న చంద్రవంక ఆకారపు బీచ్లు కూడా ఉన్నాయి. వీటిని దక్షిణం యొక్క లైట్ హౌస్ గా పిలుస్తుంటారు. కేరళలో ఉన్న ఈ బీచ్ టూర్ ట్రిప్పులకు సరైనది.

4) గోల్డెన్ బీచ్ : ఈ బీచ్ పూరీ బీచ్ అని కూడా అంటారు. ఇది దాని అందం మరియు శుభ్రతకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ కు ప్రపంచస్థాయి పర్యాటక సౌకర్యాలు కల్పించడం కోసం బ్లూ ఫ్లాగ్ అవార్డు కూడా లభించింది. గోల్డెన్ బీచ్ దిగ్బరెని స్క్వేర్ నుండి మెఫెయిర్ హోటల్ వరకు 870 మీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తరచుగా ప్రసిద్ధ వ్యక్తుల శిల్పాలను తయారు చేస్తూ కనిపిస్తారు.

5) రాధానగర్ బీచ్ : ఈ బీచ్ అండమాన్ నికోబార్ దీవుల్లోనే హేవ్ లాక్ అతిపెద్ద దీపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రాధానగర్ బీచ్ ప్రతి ఒక్కరు చూడడానికి ఒక అందమైన ప్రదేశం కానీ ఈ బీచ్ హనీమూన్ జంటలకు ఇష్టమైనదిగా పరేణించబడుతుంది. ఈ బీచ్ లో టైమ్స్ మ్యాగజైన్ ఇండియాలోని అత్యుత్తమ బీచ్లలో ఒకటిగా పరిగణించింది. రాధానగర్ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీని కూడా ఆస్వాదించవచ్చు.

Advertisement