Viral News : ప్రైవేట్ ఉద్యోగం పొంది ఎంత డబ్బు సంపాదించిన గవర్నమెంట్ ఉద్యోగికున్నంత విలువ, గౌరవం అయితే లభించదు. ఈ నేపథ్యంలోనే చాలామంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇక దానికోసం అని సొంత ఊరిని కన్నవారిని వదిలిపెట్టి దూరంగా పట్టణాలలో ఉంటూ చదువుకుంటున్నారు. అక్కడే కోచింగ్ అంటూ ఏళ్లకు ఏళ్లు ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి వారు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రాత్రింబగళ్లు కష్టపడి చదువుతుంటారు. అయితే ఆ కష్టాన్ని తగిన ఫలితం నేడు చాలామందికి దొరకడం లేదు. ఉద్యోగాలు రాకపోవడం నోటిఫికేషన్లు పడకపోవడంతో చాలామంది బలాన్మరణాలకు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల వరంగల్ కు చెందిన ప్రవళిక (25) అనే అమ్మాయి తాను ఉంటున్న హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.
అయితే వరంగల్ కు చెందిన ప్రవళిక అనే యువతీ గ్రూప్ 2 ఉద్యోగం కోసం గత కొంతకాలంగా తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాదులో ఉంటూ అక్కడే కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటుంది. అయితే ఇటీవల గ్రూపుకు సంబంధించిన పరీక్షలు వాయిదా పడటంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రవళిక సూసైడ్ నోట్ రాసి మరి ప్రాణాలు విడిచింది. దీంతో ప్రవళిక సూసైడ్ నోట్ ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. నన్ను క్షమించండి అమ్మ… నేను నష్టజాతకురాలిని నా వలన మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు. మీ కూతురుగా పుట్టటం నా అదృష్టం. మీరు నన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరు క్షమించరు. మీ కోసం నేనేం చేయలేకపోతున్నా అంటూ ప్రవళిక లెటర్ లో రాసింది.
ఇక ఈ సూసైడ్ నోట్ చూస్తే ప్రవళిక ఎంతటి బాధను ఎదుర్కొందో అర్థమవుతుంది. ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలనుకున్న తన కల ఎంతటికీ నెరవేరకపోవడంతో ఇలా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో ప్రవళిక ఉంటున్న అశోక్ నగర్ హాస్టల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రవళిక మరణాన్ని ఖండిస్తూ స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని లాఠీ ఛార్జ్ చేసే విద్యార్థులను చదరగొట్టారు. అనంతరం ప్రవళిక మృదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ప్రవళిక కుటుంబానికి అమె మృతదేహాన్ని అప్పగించినట్లుగా సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.