Anasuya : కొత్త ప్రాజెక్ట్ కోసం కొత్త లుక్ తో మళ్లీ మన ముందుకు రాబోతున్న అనసూయ.

Anasuya : అనసూయ 1985 మే 15 న సుదర్శన్ రావు, అనురాధ దంపతులకు జన్మించింది. అనసూయ ఇంటర్ చదువుతుండగా తన కాలేజీలో నాగ సినిమా షూటింగ్ జరిగింది, దాంట్లో స్టూడెంట్స్ని పాల్గొనమని చెప్పినప్పుడు అనసూయను కూడా పంపారు, ఆ మూవీలో సునీల్ పక్కన ఒక చిన్న పాత్ర చేసింది, ఆ విధంగా అనసూయ తెరమీద కనిపించడం జరిగింది. తనను తాను తెరమీద చూసుకుని అందరి ప్రశంసలు పొందటంతో ఎంతో సంతోషించింది. అప్పుడు తన ఒక చిన్న పాత్రకై ఇంతమంది మెచ్చుకుంటే మంచి మంచి పాత్రలు చేస్తే ఇంకా నాకు మంచి పేరు వస్తుందని నిర్ణయించుకుంది. అనసూయ కి అప్పట్లో ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండేది.

Advertisement

కానీ ఆ విషయం వాళ్ల నాన్నకు తెలియదు. అనసూయ వాళ్ళ నాన్న అనసూయను ఎన్ సి సి లో చేర్పించారు.ఎన్ సి సి లో ఉన్నప్పుడే బీహార్కి చెందిన శశాంక్ భరద్వాజ్ అనసూయకు ప్రపోజ్ చేశాడు, తను కూడా కొద్ది రోజులకు తన ప్రపోజల్ కి ఒప్పుకుంది. ఎన్ సి సి పూర్తి చేసిన తర్వాత అనసూయ వాళ్ల నాన్న గారితో భరద్వాజ్ గురించి చెప్పింది. వాళ్ల నాన్న దానికి ఒప్పుకోలేదు పెళ్లి చేసుకుంటే భరద్వాజనే చేసుకుంటా లేకపోతే లేదు అని మొండిగా ఉంది, దాంతో కొద్ది రోజులు అనసూయ వాళ్ళ నాన్నగారితో మాటలు కూడా లేవు. భరద్వాజ్కి జరిగింది తెలిసి ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని అనసూయ కి నచ్చచెప్పాడు.తర్వాత అనసూయ ఎంబీఏ పూర్తి చేసి ఒక ఐడీబీఐ బ్యాంక్లో పని చేసింది.

Advertisement
Anasuya coming to us again with a new look for the original project
Anasuya coming to us again with a new look for the original project

సాక్షి టీవీలో న్యూస్ రీడర్గా అవకాశం వచ్చింది, సాక్షి టీవీ న్యూస్ రీడర్గా కొంచెం ఇంగ్లీష్, కొంచెం తెలుగులో చెప్తూ అందరినీ నవ్వించేది అనసూయ, తర్వాత మా మ్యూజిక్ లో విజె గా అవకాశం వచ్చింది ఇలా షోలు చేస్తూ చివరిగా భరద్వాజ్ తో పెళ్లికి వాళ్ల నాన్నగారిని ఒప్పించింది. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ గారు ఈటీవీ ప్లస్ కోసం తరరంపం సింగింగ్ షో కోసం ప్లాన్ చేశారు.ఆ షో కోసం హేమచంద్ర అనసూయను యాంకర్స్ గా అనుకున్నారు, కానీ ఆ టైంలో హేమచంద్ర, శ్రావణ భార్గవి తో ఎంగేజ్మెంట్ అవ్వడంతో వాళ్ల ఇద్దరి జోడీ అయితే కెమిస్ట్రీ బాగుంటుంది అని అనసూయని వద్దు అనుకున్నారు.

అదే టైమ్ లో జబర్దస్త్ అనే ఒక చిన్న ప్రోగ్రామ్ గురించి ప్లాన్ చేశారు. అప్పుడు మల్లెమాల శ్యామ్ ప్రసాద్ గారు తరరంపం షోకి ముందు అనసూయని అనుకోని వద్దు అన్నం కదా ఈ జబర్దస్త్ షోలో తనకి యాంకర్ గా అవకాశం ఇద్దామని నిర్ణయించుకున్నారు. 2003 లో ఒక ఎపిసోడ్ అలా జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో మొదలైన తన ప్రయాణం కొత్త మలుపులు తిరిగింది.ఆ ప్రోగ్రామ్ కొద్ది రోజులకే మంచి పేరు తెచ్చుకుంది, అప్పటినుండి తనకి చాలా అవకాశాలు వచ్చాయి . ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు తన కెరీర్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన కెరీర్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో, షోలో, ప్రోగ్రామ్స్, అన్నింటిలో చాలా బిజీగా అయిపోయింది.తను ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

తన నటనతో అందరికీ దగ్గర అయ్యింది. మంచి మంచి సినిమాలు చేస్తూ, ప్రోగ్రాం చేస్తూ తన ఫ్యామిలీతో టైమ్ దొరికినప్పుడు వాళ్లతో ఉంటూ అన్నింటినీ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది తను ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాతో తన అభిమానులకి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది.అనసూయ నాగ, సోగ్గాడే చిన్నినాయన, క్షణం, విన్నర్, గాయత్రి, రంగస్థలం, ఎఫ్2,యాత్ర, కథనం, మీకు మాత్రమే చెప్తా, చావు కబురు చల్లగా, థ్యాంక్యూ బ్రదర్, కిలాడీ, పుష్ప, ఆచార్య, ఇలా మంచి మంచి సినిమాలు చేసి అందరి ప్రశంసలను అందుకుంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ “దర్జా” సునీల్ తో నటిస్తుంది, ఈ మూవీలో తన పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతోంది, దీనితో అందరికీ సరికొత్త పాత్రలో కనిపించబోతుంది, అనసూయ “దర్జా” మూవీ మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం.

Advertisement