Mitchell Marsh : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. 2023 ప్రపంచ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీమ్ వరల్డ్ కప్ ట్రోఫీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. ప్రపంచ కప్ ట్రోఫీ పై కాలు పెట్టి మరి ఫోటోలకి ఫోజులు ఇస్తున్నారు .దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి. ఆరు సార్లు కప్పు గెలిచిన బలుపుతో ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇలా చేస్తున్నారంటూ నేటిజనులు మండిపడుతున్నారు. ట్రోఫీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకుండా ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇలాంటి వాళ్ళని వరల్డ్ కప్ లోకి అనుమతించకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే నిన్న జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా ట్రోఫీతో తిరిగి హోటల్ రూమ్ కి చేరుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా హోటల్లో పార్టీ చేసుకుంటూ ట్రోఫీని కిందెట్టారు. కింద పెట్టడమే పెద్ద తప్పు అనుకుంటే ఆస్ట్రేలియా కు చెందిన మీచేల్ మార్స్ ఏకంగా ట్రోఫీపై కాలు పెట్టి బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రపంచ కప్ ట్రోఫీ పై కనీస గౌరవం లేకుండా ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇలా వ్యవహరించడం ఎవరికి నచ్చడం లేదు. ప్రపంచంలో మమ్మల్ని కొట్టే మొనగాడు లేడని బలుపు వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి వారికి కచ్చితంగా ఏదో ఒక రోజు సరైన గుణపాఠం లభిస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇలా చేయడం ఇదే మొదటిసారి అయితే కాదు. 2006 వరల్డ్ కప్ లో కూడా ట్రోఫీ తీసుకునే సమయంలో బీసీసీఐతో వాగ్వాదానికిి దిగారు. ఇక ఇప్పుడు ఏకంగా ట్రోఫీపై కాలు పెట్టి ఫోటోలకు ఫోజులిస్తున్నారు. 6సార్లు ప్రపంచ కప్ గెలిచామనే పొగరు వీరిలో బాగా కనిపిస్తుంది. వీరి పొగరుకు వీరి ప్రవర్తనకు ఏదో ఒకరోజు కచ్చితంగా అనుభవిస్తారని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.