బండి సంజయ్ బీఆర్ఎస్ కు మేలు చేశాడా..?

బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో టెన్త్ ప్రశ్నాపత్రాల వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని బండి సంజయ్ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా అది బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అయింది. టెన్త్ పేపర్ లీక్ అయిందంటూ బండి సంజయ్ హడావిడి వలన టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం మరుగున పడింది. దీంతో ప్రభుత్వ పెద్దలకు కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. టీఎస్సీ పేపర్ లీక్ విషయంలో కేటీఆర్ , కవిత పాత్రలపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టెన్త్ పేపర్ లీక్ అంశాన్ని బండి సంజయ్ తెరపైకి తీసుకొచ్చి టీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని కోల్డ్ స్టోరేజ్ లోకి తీసుకెళ్లారనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement

టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపెస్తోన్న దశలోనే టెన్త్ తెలుగు పేపర్ బయటకు రావడం… ఆ మరుసటి రోజు హిందీ పేపర్ కూడా బయటకు రావడంతో సర్కార్ పై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. టెన్త్ పేపర్ లీక్ అయిందని బండి సంజయ్ గట్టిగా వాదించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అందులో ఏ వన్ గా సంజయ్ ను చేర్చారు. పేపర్ లీక్ తో సర్కార్ ను బద్నాం చేయలనుకున్నారని వరంగల్ సీపీ ఆరోపించారు. వరుసగా పేపర్ లీక్ చేసి విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి , సర్కార్ ను అప్రతిష్టాలు చేయలనుకున్నారని చెప్పారు. కానీ ఈ కేసు రెండు రోజుల్లో తేలిపోయింది.

Advertisement

ఈ కేసును ఇప్పుడు పట్టించుకునే వారే లేరు. అసలు మొదట టెన్త్ పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు తేల్చలేదు. విద్యార్ధి నుంచి ఎవరు ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నది చెప్పడం లేదు. కానీ ప్రశాంత్ అనే జర్నలిస్ట్ నుంచి బండి సంజయ్ వద్దకు వచ్చిందని..వారిద్దరి మధ్య చాలా సేపు సంబాషణలు కొనసాగాయని కేసు పెట్టి రాత్రికి రాత్రి బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఇందులో కుట్ర దాగి ఉందంటూ బండిని అరెస్ట్ చేశారు. అయితే..ఈ కేసులో కీలకమని చెబుతోన్న బండి సంజయ్ ఫోన్ విషయంలో క్లారిటీ రావడం లేదు.

ఫోన్ దొరికితే సంచలన విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో తన ఫోన్ పోలీసులే తీసుకున్నారని సంజయ్ చెబుతున్నారు. అయితే బండి అరెస్ట్ సమయంలో ఆయన ఫోన్ చేస్తూనే కనిపించారు.వీడియోలో అది స్పష్టంగా కనిపించింది. కానీ పోలీసులు మాత్రం ఆ ఫోన్ తీసుకోలేదని అంటున్నారు. ఆయన ఫోన్ కీలకమని అనుకున్నప్పుడు ఆ ఫోన్ పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది అందరి ప్రశ్న. తన ఫోన్ ఇచ్చేవరకు ఈ కేసులో తాను విచారణకు రానని సంజయ్ తెగేసి చెబుతున్నారు. దీంతో ఈ కేసు ఎటుకాకుండా అయిపొయింది.

ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరికీ బెయిల్ వచ్చాయి. ఇప్పుడు కేసుపై సీరియస్ నెస్ కూడా తగ్గించేశారు పోలీసులు. మొత్తంగా టెన్త్ పేపర్ వ్యవహారంలో బండి రాజకీయాల వలన బీజేపీకి ఎంత ఫేవర్ జరిగిందో ఏమో కాని ఈ అంశం తెరమీదకు రావడంతో టీఎస్ పీస్సీ పేపర్ లీక్ ఉదంతంలో సర్కార్ కు ఉక్కపోత మాత్రం తప్పింది.

Advertisement