Post office scheme : ఈ పథకంలో పొదుపు చేశారంటే… రిటైర్మెంట్ టైం కి కోటి రూపాయలు పొందవచ్చు…

Post office scheme : సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పొదుపు పథకాలను అందిస్తుంది. పిల్లల పై చదువులు, పెళ్లి ఖర్చులు, రిటైర్మెంట్ తర్వాత అవసరాలు ఇలా అనేక కారణాలతో డబ్బు పొదుపు చేయాలనుకునే వారికి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పోస్ట్ ఆఫీస్ లో ఒక పథకం లభిస్తుంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఈ పథకంలో డబ్బును పొదుపు చేయడం ద్వారా మంచి లాభాన్ని పొందడమే కాకుండా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అందువలన టాక్స్ సేవింగ్ కోసం పిపిఎఫ్ పథకంలో చేరేవారు ఎక్కువగా ఉంటారు. రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లనే ఈ స్కీమ్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది.

Advertisement

ఈ పథకంలో ప్రతి ఏడాది కనీసం రూ.500 నుంచి 1,50,000 వరకు జమ చేయొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ స్కీం లో 7.1% వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో దాచుకునే డబ్బుకు, ఆ డబ్బుపై వచ్చే వడ్డీకి విత్ డ్రాయల్స్ కు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకంలో గరిష్టంగా 15 ఏళ్లపాటు జమ చేయవచ్చు. 15 ఏళ్ల తర్వాత డబ్బు అవసరం లేదంటే పీపీఎఫ్ అకౌంట్ ఎక్స్టెన్షన్ ఫామ్ సబ్మిట్ చేసి మరో 5 ఏళ్ళు పథకాన్ని పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్ పథకంలో డబ్బు దాచుకోవడం ద్వారా రిటైర్మెంట్ నాటికి కోటి రూపాయల పైన జమ చేయవచ్చు. ఈ పథకంలో నెలకు గరిష్టంగా 12,500 అంటే రోజుకు రూ ‌417 చొప్పున పొదుపు చేసే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి 15,000 చొప్పున 15 ఏళ్ల పాటు పొదుపు చేయవచ్చు. ప్రస్తుత వడ్డీ ప్రకారం గణిస్తే 15 ఏళ్ల తర్వాత 40.5 8 లక్షలు రిటర్న్స్ వస్తాయి.

Advertisement

Post office scheme : ఈ పథకంలో పొదుపు చేశారంటే… రిటైర్మెంట్ టైం కి కోటి రూపాయలు పొందవచ్చు…

Best Post office scheme
Best Post office scheme

పిపీఎఫ్ పథకంలో రెండుసార్లు ఐదు ఏళ్ల చొప్పున స్కీమ్ ను పొడిగించుకోవచ్చు .అంటే ఓ వ్యక్తి 35 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే 60 ఏళ్ల వయసుకు వచ్చేవరకు కొనసాగవచ్చు. మెచ్యూరిటీ టైంలో 1.03 కోట్లు రిటర్న్స్ వస్తాయి. ఇందులో జమ చేసిన మొత్తం 37 లక్షల అయితే వడ్డీ 66 లక్షలు వస్తుంది. దీనికి పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీకి కూడా పన్ను ఉండదు. ఈ స్కీంలో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు వడ్డీని లెక్కిస్తారు. కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 5వ తేదీ లోపు ఈ పథకంలో డబ్బులు పొదుపు చేయాలి.ఈ పథకం పోస్ట్ ఆఫీస్ లోనే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర బ్యాంకులో కూడా అందుబాటులో ఉంది. నామినేషన్ సదుపాయం ఉంటుంది.

Advertisement