Viral News : చిత్తూరు జిల్లా కావూరి వారి పంచాయితీ వేణుగోపాలపురానికి చెందిన భవ్య శ్రీ ఈనెల 17వ తేదీ రాత్రి నుండి కనిపించడం లేదు. దీంతో భవ్య శ్రీ తండ్రి 18వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత 20వ తేదీన గ్రామస్తులు వినాయకుని నిమజ్జనం మేరకు బావి దగ్గరకు వెళ్ళగా బావిలో భవ్య శ్రీ శవమై కనిపించింది. భవ్య శ్రీ మృతదేహాన్ని చూసిన కొందరు కుర్రాళ్ళు కేకలు పెడుతూ గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలియజేశారు. అందరూ బావి దగ్గరికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలోని మృతదేహాన్ని బయటకు తీసి భవ్యశ్రీగా గుర్తించారు.
ఇక కుమార్తె చనిపోవడంతో భవ్య శ్రీ కుటుంబ సభ్యుల శోకసంద్రంంలో మునిగిపోయారు. అయితే భవ్యశ్రీ కి అర్థ శిరోమణం చేసి కనురెప్పలు కత్తిరించి ఉరివేసి చంపేసిన తర్వాత బావిలో వేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భవ్యశ్రీ ని అత్యంత దారుణంగా చంపేశారని ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులతో పాటు నాయకులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇక పోస్టుమార్టం లో మాత్రం మూడు రోజులు బాడీ నీటిలో ఉండడం వలన జుట్టు ఊడిపోయిందని ప్రాథమికంగా ఎలాంటి గాయాలు లేవని తెలియజేశారు.
అయితే గ్రామస్తులు కుటుంబ సభ్యులు మాత్రం ఈ వాదనను ఒప్పుకోవడం లేదు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని…అనుమానితులను వెంటనే అదుపులోకి తీసుకొని చర్యలు చేపట్టాలని నిలదీశారు. దీంతో రంగంలోకి దిగిన చిత్తూరు డిఎస్ పి మృతదేహం లభించిన బావి దగ్గరకు వెళ్లి సంఘటన స్థలాన్ని గమనించారు. నలుగురు యువకులపై అనుమానం ఉందని చెప్పడంతో వారిలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అత్యాచారం జరిగిందా …?విషప్రయోగంం జరిగిందా…?అనే దానిపై పరీక్షించేందుకు శాంపిల్స్ తిరుపతి ల్యాబ్ కు పంపించామని తెలియజేశారు. ఇక ఆ నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
అయితే భవ్య శ్రీ తండ్రి మాత్రం ఇది కచ్చితంగా హత్య అని ఆరోపిస్తున్నారు. ఈత వచ్చిన భవ్య శ్రీ బావిలో పడి ఎలా చనిపోతుందంటూ మృతి రాలి తండ్రి ప్రశ్నించారు. తన కూతుర్ని చంపేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాడు. దీంతో ప్రస్తుతం భవ్యశ్రీ మృతి మిస్టరీగా మారింది.అయితే భవ్యశ్రీ కి నలుగురు అబ్బాయిలు ప్రపోజ్ చేశారట. ప్రేమించమని వెంట పడ్డారట. వాళ్ళందరికీ భవ్యశ్రీ నో చెప్పిందని ప్రచారం కూడా జరుగుతుంది. చివరికి వారే ఇంతటి కిరాతకానికి పాల్పడి ఉంటారని అనుమానాలు బలపడుతున్నాయి. తమని కాదనందుకే ఆగ్రహంతో పక్కా ప్రణాళికతో భవ్యశ్రీ ని కిడ్నాప్ చేసి ఇంతటి దారుణానికి ఒడికట్టారని గ్రామస్తులు సైతం ఆరోపిస్తున్నారు.