షర్మిలకు ఒకటే ఆప్షన్ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్

వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రెడీ అయిన వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ ఆప్షన్ ఇచ్చింది. తెలంగాణలో మాత్రం కుదరదు. ఏపీలో కాంగ్రెస్ తరుఫున రాజకీయాలు చేస్తానంటే ఒకేనని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. తెలంగాణను వీడి ఏపీలో రాజకీయాలు చేస్తే ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరిస్తోంది కానీ షర్మిల మాత్రం తెలంగాణలో ఉండేందుకు పట్టుబడుతోంది. ఏపీలో అన్న జగన్ ను ఎదురించి రాజకీయాలు చేసేందుకు షర్మిల ఆలోచిస్తున్నారు.

Advertisement

తన తండ్రి వైఎస్ ఆత్మ కేవీపీ కూడా షర్మిలను ఏపీలో రాజకీయాలు చేసుకోవాలని చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ జెండాతో వెళ్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని ఒత్తిడి తెస్తున్నారు. ఎంతోమంది నేతలు, వైఎస్సార్ అభిమానులు, జగన్ వ్యతిరేకులు షర్మిల వెంటే నడుస్తారని నచ్చజెబుతున్నారు. తెలంగాణ కన్నా ఏపీనే బెటర్ ఛాయిస్ అని షర్మిలకు సూచిస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఓ నిర్ణయం తీసుకోలేకపోతోంది.

Advertisement

తెలంగాణలో ఆమె రాజకీయం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ వ్యూహకర్తలు కూడా షర్మిలకు సూచిస్తున్నారు. భవిష్యత్ దృష్ట్యా తెలంగాణను వదిలేసి ఏపీలోనే రాజకీయం చేస్తే ప్రయోజనం ఉంటుందని సలహా ఇస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు బంతి షర్మిల కోర్టులో ఉంది. జూలై ఎనిమిది కంటే ముందుగా షర్మిల కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి ఒకే చెబితే ఏపీకి వెళ్ళినట్లే.

Also Read : విజయసాయిని వైసీపీ నుంచి గెంటేసిన జగన్..?

Advertisement