Jr.ఎన్ టి ఆర్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు RRR విజయం అందుకున్న తర్వాత వరుస ప్రాజెక్ట్ లతో దూసుకు వెళ్తున్నాడు. గతంలో ఎన్ టీ ఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన జనతా గారేజ్ చాలా పెద్ద విజయం సాధించింది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. దీనితో పాటు ఈ చిత్రానికి కథ చాలా ప్లస్ అయింది. ఈ సినిమాలో సమంతా, నిత్యామీనన్ హీరోయిన్లు గా నటించారు, ఈ సినిమాకు మోహన్ లాల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. Jr.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో ప్రేక్షకులు వీరిద్దరి కాంబినేషన్ కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు.
కొరటాల శివ తెలుగులో ఇప్పుడు ప్రభావంతమైన డైరెక్టర్లలో ఒకరు. తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించినప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వం చేసిన చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఈ సినిమాలో చేయటం జరిగింది. ఈ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో NTR30 సినిమాను చేస్తున్నాడు అనే సంచారం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. జనతా గ్యారేజ్ చిత్ర విజయం తర్వాత, అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ కోసం బాగా ఎదురుచూస్తున్నారు.

వీరిద్దరి కాంబినేషన్లో NTR 30 వస్తున్నట్లు తను ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన ట్విట్టర్ కథా ద్వారా ప్రేకకులతో పంచుకోవటం జరిగింది. RRR మూవీ తరవాత తను నటించే సినిమాల కథల పట్ల చాలా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. కొరటాల శివ NTR 30వ సినిమా కోసం jr.ఎన్ టి ఆర్ పాత్రను ఎలివెట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు మొదట హీరోయిన్ గా ఆలియా భట్ ను అనుకున్నారు. కానీ ఆలియా భట్ పెళ్లి కారణంగా ఎప్పుడు ఆమె బిజీ అయ్యింది.కావున ఆమె డేట్స్ కష్టం కావడం తో రాష్మీక మందన్న ను ఈ సినిమాకు కథానాయక గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇన్ని కారణాలతో ఈ సినిమా సెట్స్ పైకి రావటానికి ఆలస్యం అవుతున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.