ఏ క్రీడలో అయినా కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రికెట్‌లో కూడా అలాంటి విశేషాలకు కొదువ లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క బంతి కూడా వేయకుండానే మొదటి వికెట్ తీసుకున్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. ఆయనే విరాట్ కోహ్లీ.
క్రికెట్‌లో విరాట్ సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి. అయితే ‘సున్నా’ బంతికే వికెట్ తీసుకున్నాడు. అసలు సున్నా బంతి ఏంటి? వికెట్ తీయడం ఏంటనే కన్ఫ్యూజన్ ఉందా.. అయితే చెప్తా చదవండి.
2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఇచ్చాడు. కెవిన్ పీటర్సన్‌కు వేసిన తొలి బంతి వైడ్ అయ్యింది.
కానీ వికెట్ల వెనుక ఉన్న ధోనీ.. పీటర్సన్‌ను స్టంప్ అవుట్ చేశాడు. వైడ్ బాల్ అనేది కౌంట్ కాదు. కానీ స్టంపౌట్ చేస్తే అవుట్‌గా పరిగణిస్తారు. అది బౌలర్ ఖాతాలో పడుతుంది. అంటే కోహ్లీ ‘సున్నా’ బంతికే వికెట్ తీసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇలా సున్నా బంతికే వికెట్ తీసుకున్న ఏకైక బౌలర్ విరాట్ కోహ్లీ మాత్రమే.