Teenagers : చిన్నతనంలో పిల్లలు అమ్మ నాన్నని వదిలిపెట్టి అసలు ఉండలేరు. ఆ వయసులో వారికి అమ్మానాన్నల కంటే మించిన లోకం కనిపించదు. ఇక ఆ వయసులో పేరెంట్స్ ఎలా చెబితే పిల్లలు అలాగే నడుచుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్లయ్యేసరికి పేరెంట్స్ కి మరియు పిల్లలకి మధ్య కాస్త దూరం పెరుగుతుందని చెప్పాలి. టీనేజ్ వయసుకు వస్తున్న సమయంలో వారి పరిస్థితి కాస్త మారిపోతూ ఉంటుంది. తల్లిదండ్రులు వారి మంచి కోసం చెప్పిన ఆంక్షలు పెడుతున్నారనే ఫీలింగ్ వారికి కలుగుతుంది. ఈ క్రమంలోనే చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లలు పేరెంట్స్ తో గొడవ పడుతూ ఉంటారు. అలా అని వారి ఇష్టానికి వదిలేస్తే మాత్రం వారి భవిష్యత్తు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ..
అయితే పిల్లలలో 14 ఏళ్లు వచ్చేసరికి స్వతంత్ర భావాలు కనిపిస్తాయి. ఈ సమయంలోనే స్వేచ్ఛగా స్వాతంత్రంగా గడపాలనుకుంటారు.ఈ క్రమంలోనే వారి బాగు కోసం చెప్పే మంచి పనులు వారికి నచ్చవు. ఏది మంచి ఏది చెడో నాకు తెలుసు అంటూ ఎదిరిస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రవర్తించడం అనేది పిల్లలు తప్ప అసలు కాదు. ఎందుకంటే ఎదిగే క్రమంలో పిల్లలో జరిగే రసాయన చర్యల ప్రభావమది. అందుకే ఈ సమయంలో పిల్లలకు తగినట్టు తల్లిదండ్రులు మారినట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లల్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సమయంలోనే తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలి. టీనేజ్ వయసుకి వస్తున్న పిల్లలను చేజారి పోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
దీనికోసం తల్లిదండ్రులు పిల్లలు చెప్పే విషయాన్ని ముందు శ్రద్ధగా వినండి. అంతేకానీ ముందుగా వారితో వాదన వదు. అలాగే వారి పాజిటివ్ ఆలోచనలకు మద్దతిస్తూ ఏవైనా లోపాలు ఉంటే సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే నేరుగా కాకుండా కొన్ని ఉదాహరణ ఆధారంగా వారికి వివరిస్తే బాగుంటుంది. ఇక ప్రతి వ్యక్తి జీవితంలో టీనేజ్ అనేది ఒక తాత్కాలిక దశ మాత్రమే. అది అందరికీ తెలిసిందే. చివరిదాకా ఇదే దశలో ఎవరు ఉండరు. కాబట్టి పిల్లల విషయంపై పేరెంట్స్ కి క్లారిటీ ఉండాలి. ఈ సమయంలో వారిని బాధించే విధంగా కాకుండా వారితో సున్నితంగా వ్యవహరిస్తూ మంచి మాటలు చెప్పినట్లయితే టీనేజ్ వయసులో పిల్లలను సరైన దిశగా అడుగులు వేపించవచ్చు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.