టి. బీజేపీ అసంతృప్త నేతలు ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పార్టీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ లో పాల్గొనకుండా ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈటల, కోమటిరెడ్డిలను ఢిల్లీకి పిలిచి వారితో అమిత్ షా , నడ్డా మాట్లాడారు. అయినప్పటికీ ఆదివారం జేపీ నడ్డా నాగర్ కర్నూల్ పర్యటనకు దూరంగా ఉండి హస్తినలో మకాం వేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఆదివారం మధ్యాహ్నం వరకు రాజగోపాల్ రెడ్డితోనే ఈటల మంతనాలు కొనసాగించారు. ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ ముగియడంతో తెలంగాణకు తిరుగు పయనం అవుతారని..నాగర్ కర్నూల్ సభలో పాల్గొంటారని అంత భావించారు కానీ వారు మాత్రం హస్తిన వీడలేదు. అయితే వారు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సోమవారం పొంగులేటి, జూపల్లిలు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యేందుకు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి వారితో ఈ ఇద్దరు నేతలు రాహుల్ ను కలుస్తారన్న ప్రచారం గుప్పుమంది. అందుకే హస్తినను విడిచి రావడం లేదన్న పుకార్లు షికార్లు చేశాయి.
ఈ ప్రచారంపై ఈటల , కోమటిరెడ్డి వర్గీయులు స్పందించారు. ఇంకా ఈటల, కోమటిరెడ్డి లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పార్టీలో జరుగుతోన్న పరిణామాలను అమిత్ షా, నడ్డాలకు వివరించినా పెద్దగా పట్టించుకోలేదని వారు అసంతృప్తిగా ఉన్నారు. దాంతో మోడీని కలిసి పరిస్థితులను వివరించేందుకు ఇంకా ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు.
Also Read : కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – ఎల్బీ నగర్ నుంచి పోటీ..?