బండి సంజయ్ ను బుక్ చేసిన ఈటల..!?

కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తిరిగి బీజేపీ వైపే వేలెత్తి చూపేలా ఉన్నాయా…? ఈటల చేసిన ఆరోపణలు బీజేపీకి సైతం నష్టం కల్గించేలా ఉన్నాయనే భావించే, ఈ వివాదంలో ఆ పార్టీ నేతలు సైలెంట్ అయ్యారా..?అంటే అవుననే సమాధానం వస్తోంది.

Advertisement

మునుగోడు బైపోల్ సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ.25కోట్లు తీసుకుందని ఈటల చేసిన వ్యాఖ్యలు అటు, ఇటు పోయి బీజేపీని డిఫెన్స్ లో పడేశాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పాతిక కోట్లు తీసుకుంది సరే… దీనిపై బీజేపీ నేతలంతా కలిసి ఎందుకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్న చర్చకు వస్తోంది. ఎప్పుడో ముగిసిన మునుగోడు ఉప ఎన్నిక గురించి ఈటల తాజాగా మాట్లాడటం వెనక ఆయన వ్యూహం ఏంటని బండి వర్గం సైతం ఆరా తీస్తోంది. అయితే … ఈటల కాంగ్రెస్ టార్గెట్ గా ఆరోపణలు చేసినా అసలు టార్గెట్ బండి సంజయ్ అయి ఉండొచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఎందుకంటే… బీఆర్ఎస్ – కాంగ్రెస్ పై ఈటల ఆరోపణలు చేయగానే బీజేపీపై ఎదురుదాడి ప్రారంభమైంది. నిజంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది బీజేపీనే అయితే..కేసీఆర్ అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ బీజేపీని వేలెత్తి చూపేలా ఉన్నాయి. కేసీఆర్ అవినీతి కేసులో జైలు పంపుతామని బండి సంజయ్ గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈటల చేసిన ఆరోపణల ద్వారా కాంగ్రెస్ లేవనెత్తుతోన్న విషయాలతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. ఇదే బీఆర్ఎస్ పై పోరులో బీజేపీ విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా మారింది.

అందుకే ఈటలకు బండి వర్గం నుంచి ఏమాత్రం సపోర్ట్ అందటం లేదని… పార్టీలో పట్టు సాధించేందుకు ఈటల ఆరోపణలు చేసి పార్టీపై నమ్మకం సడలేలా చేశారని బండి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా.. ఈటలకు మద్దతుగా ఎవరూ ఈ విషయంలో ఏం మాట్లాడిన బండికి ఆగ్రహాన్ని తెప్పిస్తోందని చాలామంది నేతలు మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు.

Advertisement