AR Rahman : కొంచమైనా సిగ్గుండాలి…ఏఆర్ రెహమాన్ పై ఫ్యాన్స్ ఫైర్…అసలేం జరిగిందంటే…

AR Rahman  : బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఆదివారం చెన్నైలో పర్యటించారు.ఓ సంగీత కచేరిలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఆదిత్య రామ్ ప్యాలెస్ లో  సంగీత కచేరి నిర్వహించారు. అయితే ఊహించని విధంగా కచేరి కి ప్రజలు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంగీత కచేరి కి దాదాపు 50 వేల మంది వచ్చినట్లు సమాచారం. దీంతో తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్గనైజర్స్ తీరుపై నేటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనలో పిల్లలకు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది రెహమాన్ కెరియర్ లోనే చెత్త కచెరి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచేరి ఆర్గనైజర్స్ పరిమితికి మించి టికెట్స్ ను విక్రయించారని అభిమానులు ఆరోపిస్తున్నారు.

Advertisement

fans-disappointment-angry-ar-rahmans

Advertisement

 

వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొంటే నిరాశకు గురయ్యామని వెల్లడించారు. ఈవెంట్స్ ను నిర్వహించే తీరు ఇదేనా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 5 వేల రూపాయలు పెట్టి టికెట్స్ తీసుకున్నామని కానీ తగిన ఫలితం దక్కలేదని వాపోయారు. ఇది ఒక ఫేక్ ఈవెంట్ అంటూ మండిపడ్డారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ టికెట్ డబ్బులను తిరిగి చెల్లించవలసిందిగా నిర్వహకులను కోరుతున్నారు. ఇది ఒక పెద్ద స్కామ్ అంటూ ఆరోపిస్తున్నారు. ఇలా వస్తున్న వార్తలపై నిర్వాహకులు స్పందిస్తూ ప్రియమైన చెన్నై అభిమానులారా మీలో టికెట్టు కొనుగోలు చేసి దురదృష్టవశాత్తు ఈవెంట్లో పాల్గొనలేకపోయిన వారు దయచేసి మీ టికెట్ కొనుగోలు కాపీని మరియు ఫిర్యాదు ను మెయిల్ కు షేర్ చేయండి మా బృందం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

fans-disappointment-angry-ar-rahmans

ఇక ఈ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షార్ట్ ను ఏఆర్ రెహమాన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కొంతమంది నన్ను గోట్ అని పిలుస్తున్నారు. ఈసారి నన్ను త్యాగం చేసే మేకగానే ఉండనివ్వండి. చెన్నై ప్రపంచ స్థాయి మౌలిక సదుపాలతో వర్ధిల్లాలి. టూరిజం లో పెరుగుదల నిబంధనలను పాటించేలా ప్రేక్షకులను మెరుగుపరచడం ,పిల్లలకు మహిళలకు సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు. అయితే ఏఆర్ రెహమాన్ చేసిన ట్వీట్ పై నేటి జనులు భిన్నంగా స్పందిస్తున్నారు.

fans-disappointment-angry-ar-rahmans

ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ మీ పోస్టులో క్షమాపణ ఎక్కడ ఉంది….సిగ్గుపడండి సార్…ప్రజలు మిమ్మల్ని చూడడానికి వస్తారు. కానీ వారికి క్షమాపణ చెప్పడానికి మీకు నిజంగా కష్టంగా అనిపిస్తుందా అని రాసుకొచ్చాడు. మరొకరు రాస్తూ మేము ఎల్లప్పుడూ మీకు అభిమానులమే.దీనికి చెన్నై మౌలిక సదుపాయాలను నిందించవద్దు. ఇది పెద్ద స్కామ్. కెపాసిటీ కంటే పది రెట్లు ఎక్కువ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ రాసుకొచ్చారు. మరొకరు రాస్తూ నిన్నటి వరకు నేను మీ అభిమానిని కానీ మీ పోస్ట్ చూశాక మీ అభిమానిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానంటూ రాసుకోచ్చాడు.

Advertisement