ఇంటికే మద్యం సరఫరా – సర్కార్ సంచలన నిర్ణయం

మద్యం ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునేందుకు తమిళనాడు డీఎంకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లబ్బులు, స్టార్ హోటల్స్ కి మాత్రమే మద్యం వినియోగానికి పర్మిషన్ ఇచ్చిన సర్కార్ తాజాగా కాన్ఫరెన్స్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, మ్యారేజ్ హాల్స్, బాంక్వెట్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల్లోనూ మద్యం అమ్మకాలకు స్టాలిన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇళ్ళకు, శుభకార్యాలకు మద్యం పంపిణీ చేసేందుకు స్టాలిన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

తమిళనాడు సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో వివిధ ఫంక్షన్స్ , సమావేశాలకు అధికారికంగానే మద్యం సరఫరా చేసుకునేందుకు వీలు కల్గుతుంది. అయితే… ఇలా అందరూ సరఫరా చేసేందుకు వీలు లేదు. సర్కార్ లైసెన్స్ కల్గి ఉంటేనే మద్యం పంపిణీ చేయవచ్చు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ‘ఎఫ్.ఎల్.12’ అనే ఒక ప్రత్యేక లైసెన్స్ ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని కూడా తమిళనాడు ఎక్సైజ్ శాఖ గత నెలలోనే జారీ చేసింది.

Advertisement

కాగా ఈ ప్రత్యేక లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ జారీ చేస్తారు. ఈ లైసెన్స్ గడువు ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఈ లైసెన్స్ చెల్లుబాటు కాదు. లైసెన్స్ గడువు పొందిన ఆ రెండు రోజులు ఆయా సమావేశాలు, సభల్లో పాల్గొనే వారికీ మద్యం సరఫరా చేసే వీలుంటుంది.

ఏదైనా ఫంక్షన్ కు మద్యం సరఫరా చేయాలనుకుంటే లైసెన్స్ కోసం వారం ముందుగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజ్ చెల్లించాలి. వాణిజ్యపరమైన ఈవెంట్లకు వార్షిక రుసుము కింద మున్సిపల్ కార్పొరేషన్ లలో లక్ష రూపాయలు, మున్సిపాలిటీల్లో ఏడాదికి రూ. 75వేలు లైసెన్సు ఫీజు చెల్లించాలి.

నాన్–కమర్షియల్ గా ఒక్కరోజుకి ప్రత్యేక లైసెన్స్ కింద మునిసిపల్ కార్పొరేషన్లలో రూ.11,000 మున్సిపాలిటీల్లో రూ. 7500 ఇతర ప్రదేశాల్లో రూ.5 వేలుగా నిర్ధారించారు.

Advertisement