Health Benefits : పుట్టగొడుగుల్లో ఉండే పోషకాల గురించి తెలిస్తే…… ఇక మీరు వదలరు.

Health Benefits : ఇవి గొడుగు ఆకారంలో ఉండి ఎక్కువగా పుట్టలపై ములుస్తాయి. అందుకే వీటికి పుట్టగొడుగులని పేరు వచ్చింది. పుట్టగొడుగులు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. మిగిలిన సమయంలో ఇవి ఎక్కువగా లభించవు. అందుకే వీటి ధర అధికంగా ఉంటుంది. ఇది తేమ ఎక్కువగా ఉండే ప్రదేశంలో మొలకెత్తుతాయి. కానీ వ్యవసాయదారులు అన్ని సీజన్లో వీటిని పండిస్తున్నారు.

Advertisement

ప్రస్తుత కాలంలో మార్కెట్లలో పుట్టగొడుగులు విరివిరిగా అమ్ముతున్నారు. పుట్టగొడుగులు అనేది ఒక రకమైన శిలీంద్రం. పుట్టగొడుగులు అనేక రకాలుగా కనిపిస్తాయి. కానీ వీటిల్లో కొన్ని మాత్రమే ఆహారంగా తీసుకోవడానికి ఉపయోగపడతాయి. పుట్టగొడుగులు ఎక్కువగా నేల మీద కానీ, పుట్టల మీద, వివిధ రకాల చెట్ల మీద మొలకెత్తుతాయి.

Advertisement

Health Benefits : పుట్టగొడుగుల్లో ఉండే పోషకాల గురించి తెలిస్తే..

health benefits of mushrooms
health benefits of mushrooms

ఈ గొడుగులను కొందరు కూరగా తింటారు. మరికొందరు వివిధ రకాల ఆహార పదార్థాలు తయారీలో వాడుతారు. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. వీటిలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. అందుకే పోషకాల పుట్టగా పిలుస్తారు. క్యాన్సర్, డయాబెటిస్ ,ఉబ్బసం ,గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల ఈ వ్యాధుల నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది.

వీటిలో 80 శాతం నీరు ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. పుట్టగొడుగుల్లో సోడియం ,పొటాషియం, ఐరన్ ,మెగ్నీషియం, వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి. వీటితోపాటు విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువగా ఉండి మన శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. పుట్టగొడుగుల్లో ఫైబర్ ,కార్బో హైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.

శరీరంలోనే కొలెస్ట్రాల స్థాయిని తగ్గించి, రక్తహీనత సమస్యలను దూరం చేస్తాయి. పుట్టగొడుగుల రోజు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉండి, పంటి సమస్యలను దూరం చేస్తాయి. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఈ మష్రూమ్స్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అదేవిధంగా సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ వీటిలో అధికంగా ఉంటుంది. వీటిని తప్పకుండా మనం తినే ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు

Advertisement