Health benefits : రోజు రాగి జావ‌ను తాగండి…డ‌యాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచుకోండి…

Health benefits : ఈ త‌రం వారి జీవ‌న విధానం చాలా మారిపోయింది. రుచుల కోసం పోష‌కాలు లేని, వివిధ ర‌కాల ఆహార ప‌దార్ధాల‌ను తింటున్నారు. దీనివ‌ల‌న అనేక రోగాల బారిన ప‌డుతున్నారు. బ‌లం లేని ఆహారాన్ని తింటూ శ‌రీరాన్ని బ‌ల‌హీన‌ప‌రుచుకుంటున్నారు. ఏదైనా ప‌నిని గ‌ట్టిగా చేసారంటే త్వ‌ర‌గా అల‌సిపోతారు. అదే మ‌న పూర్వీకులు అయితే ఏ ప‌నిని అయిన అల‌సిపోకుండా త్వ‌ర‌గా చేసేవారు. ఎందుకంటే వీరు తినే ఆహారం శ‌రీరానికి అంత బలాన్నిస్తుంది. మ‌న తాత‌, ముత్తాత‌లు ఎక్కువ‌గా రాగిజావ‌, రాగిముద్ద‌, రాగి రొట్టెల‌ను తినేవారు. అందుకే వారు అంత స్ట్రాంగ్ గా ఉండేవారు. ఏ ప‌నిని అయిన అలఓక‌గా చేసేవారు. రాగుల వ‌ల‌న అలాంటి ప్ర‌యోజ‌నం ఉంటుంది మ‌రి.

Advertisement

ఇప్పుడు బియ్యం వ‌చ్చేస‌రికి ఇవ‌న్ని అట్ట‌డుగున ప‌డిపోయాయి. ఎందుకంటే బియ్యం మెత్త‌గా ఉడుకుతాయి. అలాగే తొంద‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అంతేకాకుండా కూర‌ల్లోను, ప‌చ్చ‌ల్లోను ఇవి రుచిగా ఉంటాయి. అందుకే అంద‌రు బియ్యాన్ని ఎక్కువ‌గా వాడుతున్నారు. వీటి వ‌ల‌న స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని రాగుల‌ను తిన‌డానికి ఇప్పుడు ఇష్ట‌ప‌డుతున్నారు.మ‌న శ‌రీరానికి 100 గ్రాముల రాగులు తీసుకుంటే అందులో 320 క్యాల‌రీల శ‌క్తి వ‌స్తుంది.రాగుల‌లో 67 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 12 గ్రాముల ప్రోటీన్స్, 7 గ్రాముల ఫ్యాట్, 11 గ్రాముల ఫైబ‌ర్ ఉంటాయి. అంతేకాకుండా, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్ మొద‌ల‌గు విలువైన పోష‌కాలు ఉంటాయి.క‌నుక రాగుల‌ను తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి చాలా మంచిది.

Advertisement

Health benefits : రాగి జావ‌తో డ‌యాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచుకోండి…

Health benefits of raagulu with control the diabetes in our body
Health benefits of raagulu with control the diabetes in our body

కొంద‌రు రాగుల‌ను జావ‌గా చేసుకొని తాగుతారు, మ‌రికొంద‌రు రొట్టెలుగా చేసుకొని తింటారు. అయితే రాగి జావ కంటే రాగిరొట్టెలు మ‌న ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి డ‌యాబెటీస్ ఉన్న‌వారికి చాలా మంచిది. రాగి రొట్టెలు ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిని నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. ఎందుకంటే దీనిలో ఉండే ఫైబ‌ర్ చ‌క్కెర‌ను పెర‌గ‌కుండా చేస్తుంది. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారికి ఈ రొట్టెలు బాగా స‌హాయ‌ప‌డుతాయి. రోజు రాగి రొట్టెల‌ను తిన‌డం వ‌ల‌న సులువుగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఈ రొట్టెలు వేడి చేయ‌వు కాబ‌ట్టి రోజు తిన‌వ‌చ్చు. కాల్షియం త‌క్కువ‌గా ఉండి ఎముక‌లు గుళ్ల బారిన వారు రాగిజావ‌ను తాగితే చాలా మంచిది. ఎటువంటి మెడిసిన్స్ వాడ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

అలాగే రాగిపిండిని పుల్ల‌టి పెరుగులో క‌లిపి దోసెలు లాగా కూడా వేసుకోవ‌చ్చు.రాగిముద్ద చిన్న‌పిల్ల‌ల‌కు, జిమ్ ఎక్స‌సైజ్ చేసేవారికి, గ‌ర్భీణీల‌కు, బాలింత‌ల‌కు చాలా మంచిది. రాగిపిండితో స్నాక్స్, కేక్స్ చేసుకోవ‌చ్చు. అలాగే మ‌ల‌బ‌ద్ధ‌కం ఉన్న‌వారికి ఈ రాగిజావ బాగా ప‌ని చేస్తుంది. అంతేకాకుండా, శ‌రీరంలో ర‌క్తం లేని వారు రాగుల‌ను తీసుకోవ‌డం వ‌ల‌న మంచి ఫ‌లితం ఉంటుంది. ఎందుకంటే రాగుల‌లో ఐర‌న్ శాతం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ర‌క్త‌హీన‌త రాకుండా కాపాడుతుంది. క‌నుక రాగుల‌ను ఎక్కువ‌గా తిన‌డానికి ప్ర‌య‌త్నించండి.

Advertisement