Health tips : వెల్లుల్లితో అధిక బరువు తగ్గించవచ్చా….. అయితే ఈ టిప్స్ మీకోసం.

Health tips : ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యలతో సతమతమవుతున్నారు. బరువు తగ్గటానికి చాలామంది అనేక రకాల కూరగాయల జ్యూసులను మరియు దుంపలను తింటున్నారు. కానీ ఇటువంటి ప్రయోజనం ఉండడం లేదు. వీటి కంటే వెల్లుల్లి ఎన్నో రెట్లు మెరుగ్గా పనిచేస్తుంది. వెల్లుల్లితో అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వెల్లుల్లి కనిపిస్తుంది. భారతీయుల్లో వెల్లుల్లి లేని వంటకం అంటూ ఏమీ ఉండదు.

Advertisement

ఆయుర్వేద చిట్కాలలో దీనిని బాగా వాడుతున్నారు. రోజు వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని రోజు పరగడుపున రెండు రెబ్బలు తీసుకోవడం వల్ల బరువు తగ్గి, బీపీ , షుగర్ ను లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. పొట్ట ,నడుము చుట్టు పేర్కొన్న కొవ్వుని కరిగిస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, క్యాల్షియం ఉంటాయి. వెల్లుల్లిలో ప్రత్యేకమైన గుణాలు ఉంటాయి. వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచడానికి శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించడానికి, జలుబు, జ్వరం వ్యాధులను తగ్గించడానికి సహాయపడతాయి.

Advertisement

Health tips :. అయితే ఈ టిప్స్ మీకోసం

Health tips of garlic
Health tips of garlic

వెల్లుల్లి వల్ల బరువు తగ్గడానికి ఈ చిట్కా మీకోసం. రెండు ఎల్లుండి రెబ్బలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి, ఉదయాన్నే రెబ్బలను తీసి వేసి ఆ గ్లాస్ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొన్ని ఎల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా నూరి దాని నుండి రసాన్ని తీసి ఈ రసంలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చు. వెల్లుల్లి అధికంగా వాడితే కడుపులో మంట ,ఆసిటిటీ, వాంతులు వంటివి అనారోగ్యాలు వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈరోజు రెండు మూడు రెబ్బలకి మించి తీసుకోరాదు.

Advertisement