High Alert In Hyderabad : రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు….హైదరాబాద్ కు హై అలర్ట్…

High Alert In Hyderabad  : ప్రస్తుతం హైదరాబాదులో కుండపోత వర్షం కురుస్తోంది. సోమవారం రాత్రి నుండి హైదరాబాదులో పలుచోట్ల ఎడతెరపు లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఇక ఈరోజు వనస్థలిపురం ,ఎల్బీనగర్ , సాగర్ రింగ్ రోడ్డు, హస్తినాపురం , దిల్ సుఖ్ నగర్, అబిడ్స్, ఖైరతాబాద్ పంజాగుట్ట, కుకట్ పల్లి. హైదర్ నగర్ , నిజాంపేట్ ,ప్రగతి నగర్ ,కే బి హెచ్ పి కాలనీ, అమీర్ పేట్ , సోమాజిగూడ , సైదాబాద్, పాతబస్తీ , బేగంపేట , మారేడుమిల్లి ,బోయిన్ పల్లి , తిరుమలగిరి , పారడైజ్, చిలకలగూడ ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

heavy-rains-in-two-telugu-states-hyderabad-on-high-alert

Advertisement

ఎడతెరపు లేకుండా వర్షాలు పడడంతో వర్షపు నీరంతా భారీగా రోడ్లపై చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాక పలుచోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలో మరో గంట పాటు ఎడతెరపు లేకుండా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నగరంలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఇళ్ల నుండి ఎవరు బయటకు రావద్దని జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

heavy-rains-in-two-telugu-states-hyderabad-on-high-alert

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.దీనికి తోడు ఏపీ తెలంగాణ మీదుగా మరో ఉపరితలావర్త్రం కొనసాగుతోంది. ఇక ఈ ఉపరితల ఆవర్తనం కొన్ని గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ మేరకు తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్  జారీ చేసింది. యాదాద్రి , భువనగిరి ,సంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్ ,మల్కాజ్గిరి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారి చేశారు..

Advertisement