ఇకనుంచి తెల్ల రేషన్ కార్డ్ వాళ్ళకు గుడిలో రిజర్వేషన్లా?

తెల్ల రేషన్ కార్డ్ ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. అందులో ఉచిత బియ్యం, పోడు భూములు, ఉచిత చీరలు లాంటివి ఎన్నో ఉన్నాయి.

Advertisement

అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తెల్ల రేషన్ కార్డ్ వాళ్ళకు గుడిలో రిజర్వేషన్ కల్పిస్తోందో. అంటే వి ఐ పి లు డబ్బులు పెట్టి కొనుక్కునే సేవలను తెల్ల రేషన్ కార్డ్ వాళ్ళకు ఉచితంగా పొందవచ్చు. ఈ ప్రయోగం శ్రీశైలం మల్లన్న భక్తులకు కల్పిస్తున్నారు.ఇది గనక విజయవంతం అయితే ఇకపై అన్ని గుడులల్లో ఈ పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

Advertisement

అందుకే శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం పేద భక్తులకు గొప్ప శుభవార్త చెప్పింది. ధర్మ ప్రచారంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన భక్తులకు నెలలో ఒక రోజు ఉచిత ఆర్జిత సేవలకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25న ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉచిత సామూహిక అభిషేకాలను దేవస్థానం నిర్వహించనుంది. దీనిలో 250 మందికి అవకాశం కల్పించనున్నారు. భక్తులు www.srisailadevasthanam.org సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

Advertisement