Aadi Pinishetty : ఈ సినిమాలో నాకు ఇంత పేరొచ్చిందంటే… రామ్ తగ్గడం వలనే అంటున్న ఆది పినిశెట్టి…

Aadi Pinishetty : ఆది పినిశెట్టి ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. మొదటిలో ఆయన హీరోగా సినిమాలు చేశారు. తర్వాత విలన్ గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సరైనోడు సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాతో ఆది పినిశెట్టి బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా హిట్ కావడంతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. డిఫరెంట్ రోల్స్ ను ఎంచుకుంటూ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఆది పినిశెట్టి ‘ ది వారియర్ ‘ మూవీ సక్సెస్ లో మాట్లాడుతూ మనతో కొన్ని విషయాలను పంచుకున్నారు.

Advertisement

నేను తెలుగు వాడిని అని తమిళ ప్రేక్షకులు అనుకుంటున్నారు, తెలుగు వాళ్లేమో తమిళ్లోడిని అంటున్నారు. అయినా ప్రేక్షకులు ఇప్పుడు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, నటన బాగుంటే ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారు అని ఆది పినిశెట్టి అన్నారు. తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వ వహించిన చిత్రం ‘ ది వారియర్ ‘ .ఈ చిత్రంలో రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి పవర్ఫుల్ విలన్ గురు పాత్రలో నటించారు.

Advertisement

Aadi Pinishetty : ఈ సినిమాలో నాకు ఇంత పేరొచ్చిందంటే… రామ్ తగ్గడం వలనే అంటున్న ఆది పినిశెట్టి…

Hero aadi pinishetty speech about ' The warrior ' movie success
Hero aadi pinishetty speech about ‘ The warrior ‘ movie success

సరైనోడు, అజ్ఞాతవాసి సినిమాలో విలన్ గా చేశాను. ఆ తరువాత ఏ క్యారెక్టర్స్ వచ్చిన అజ్ఞాతవాసి కంటే బెటర్ గా ఉండాలని అనుకున్నాను. ‘ ది వారియర్ ‘ చిత్రంలో ఆర్డినరీ విలన్ గా కాకుండా గురు పాత్రకి ఒక క్యారెక్టర్రైజేషన్ ఉంది. అది నచ్చడంతో ఈ సినిమాను చేశాను. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘ ది వారియర్ ‘ క్లైమాక్స్ ఫైట్ లో రామ్ కు, నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఆ క్రెడిట్ అంతా ఫైట్ మాస్టర్స్ దే. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే డాన్స్ చేస్తున్నట్లు ఉందని లింగు స్వామి తెలిపారు. నాన్న (దర్శకుడు రవిరాజా పినిశెట్టి) నాలో నెగిటివ్ పాయింట్స్ చెబుతారు. ఈ చిత్రంలో నా యాస ఇంకొంచెం మారాలి అని అన్నారు. నేను హైలెట్ అయ్యాను అంటే రామ్ వలనే అని, అతను కొంచెం తగ్గడం వలన నీకు ఇంత పేరు వచ్చింది అని అన్నారు

Advertisement