Chicken Biryani : సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవడం ఎలా మీకోసం….

Chicken Biryani : సన్ డే వచ్చిందంటే అందరూ ఆరోజు ఏం స్పెషల్ చేసుకోవాలి ఏ స్పెషల్ తినాలి.బయటికెళ్లి తినాలా ఇంట్లో చేసుకోవాలా అని. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం సింపుల్ టేస్టీగా ఇంట్లోనే చేసుకునే విధంగా చికెన్ బిర్యానీ మీకోసం.చికెన్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు. చికెన్, ఉప్పు, కారం, నూనె,పసుపు, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్ట్,పెరుగు, నిమ్మకాయలు రసం, పూదీనా, కొత్తిమీరా, ఆల్ గరం మసాలాలు, బగారా ఆకు,వేయించిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,ఫుడ్కలర్.చికెన్ బిర్యానీ

Advertisement

చేసుకునే విధానం: ముందుగా చికెన్ కి అన్ని మసాలాలు ,పట్టించి రెండు నుంచి మూడు గంటలు మ్యాగ్నెట్ చేసుకోవాలి. చికెన్ వన్ కేజీ తీసుకుంటే రైస్ కూడా వన్ కేజీ తీసుకోవాలి.అయితే ముందుగా చికెన్ ని బాగా రెండు మూడుసార్లు కడుక్కొని పెట్టుకోవాలి. దాంట్లో ఉప్పు,కారం, పసుపు, కొద్దిగా నూనె పచ్చిమిర్చి పేస్ట్,అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ రసం, ధనియాలపొడి,గరం మసాలా పొడి,అన్నీ వేసుకుని మంచిగా చికెన్ తో మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.

Advertisement

అలా కలుపుకున్నా చికెన్ మిశ్రమాన్ని రెండు నుంచి మూడు గంటలు ఫ్రిజ్లో మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకోవాలి.అలా మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకోవడం వలన జ్యూసీగా, అండ్ టెస్ట్ గా, చికెన్ తొందరగా కుక్ అవుతుంది.ఇకపోతే తరువాత ఉల్లిపాయలను వేయించుకొని పెట్టుకోవాలి.అన్నం కోసం బాస్మతి రైస్ అయినా మామూలు రోజూ వాడే రైస్ అయినా సరే ఒక గంట ముందు నానబోసి పెట్టుకోవాలి.

Chicken Biryanii : చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవడం ఎలా మీకోసం..

how to make tasty chicken biryani at home for you
how to make tasty chicken biryani at home for you

తర్వాత అన్నం ఉడికించి కోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఎసరు కోసం నీరు పోసుకోవాలి.ఆ నీటిలో కొద్దిగా బగారా ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, సాజీరా,మరాటీమొగ్గ, కొంచెం పుదీనా, కొత్తిమీర, లైట్గా ఉప్పు, లైట్గా రెండుమూడు చుక్కల నూనె వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత నీరు బాగా తెరల కాగేదాక మరిగించుకోవాలి. అలా మరుగుతున్న నీటిలో నానబెట్టిన బియ్యం వేసుకోవాలి.

బియ్యం 75% కుక్ అయ్యేంత వరకు మాత్రమే ఉంచుకోవాలి.అలా ఉడికిన అన్నాన్ని వడకట్టి పెట్టుకోవాలి.ఇకపోతే తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఆ గిన్నె అడుగుభాగంలో వేసుకోవాలి.ముందుగానే ఆ గిన్నె అడుగుభాగానికి నూనె లేదా నెయ్యి తో మొత్తం గిన్నెకి రాసుకోవాలి.మ్యాగ్నెట్ చేసిన చికెన్ని అడుగుభాగంలో వేసిన తర్వాత ఈ ఉడికించిన అన్నం మొత్తాన్ని చికెన్ పైన వేసుకోవాలి.

ఆ ఉడికించిన అన్నం పైన పూదీనా, కొత్తిమీరా,కొద్దిగా నిమ్మకాయ రసం, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, లైట్గా ఫుడ్ కలర్, అన్నీ వేసుకోవాలి.కొద్దిగా నూనె కూడా వేసుకుంటే మంచిది.అన్ని వేసుకున్న తర్వాత ఆ గిన్నెపై మూట టైట్గా పిండితో పెట్టాలి. లేకపోతే ఆ మూత పైన ఏదైనా బరువున్న వస్తువైనా పెట్టుకోవాలి. దాంట్లోనుంచి గాలి బయటికి రాకుండా చూసుకోవాలి.అలా అంతా రెడీ చేసుకున్న గిన్నెని డైరెక్ట్గా స్టౌపైన పెట్టకూడదు, ముందుగా స్టవ్ పైన చపాతీ పెనం వేడి చేసుకుని పెట్టుకోవాలి.

ఆ వేడి చేసుకున్న చపాతీ పెనంపైన మనం రెడీ చేసుకున్న గిన్నెని పెట్టుకొని పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాలు సిమ్ లో ఉడికించుకోవాలి.అలా మొత్తం ముప్పై నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ బిర్యానీ రెడీ అవుతోంది.పొయ్యి ఆపేసిన తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు ఆ గిన్నెని అలాగే ఉంచాలి.అంతే ఎంతో టేస్టీగా ఇంట్లోనే చికెన్ బిర్యానీ రెడీ అవుతోంది. తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే సరిపోతుంది .

Advertisement