ఇండియాకు జీఎస్ఐ గుడ్ న్యూస్ – చైనా అధిపత్యానికి ఫుల్ స్టాప్

భారత్ కు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైనింగ్ శాఖ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. లిథియం అవసరాల కోసం ఇక నుంచి చైనాపై భారత్ ఆధారపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మన దేశ అవసరాల్లో 80శాతం అవసరాలను రాజస్థాన్ లోని లిథియం నిల్వలు తీర్చగలవని జీఎస్ఐ వెల్లడించింది.

Advertisement

Advertisement

మొబైల్ , ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో లిథియంను వినియోగిస్తారనేది తెలిసిందే. ఇండియాలో లిథియం తయారీ వస్తువుల కోసం తరుచుగా చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భారత్ లో లిథియం అవసరాల డిమాండ్ దృష్ట్యా చైనా అధిక ధరలకు లిథియంను ఎగుమతి చేస్తోంది. జీఎస్ఐ, మైనింగ్ శాఖ అధికారులు తాజాగా రాజస్థాన్ లో లిథియం నిల్వలపై సర్వే చేపట్టగా… జమ్మూ కాశ్మీర్ లో గిర్తించిన లిథియం నిల్వల కంటే రాజస్థాన్ లో అధిక మొత్తంలో నిల్వలు ఉన్నాయని తేల్చారు.

తాజాగా బయటపడిన నిల్వలతో ఇక నుంచి లిథియం దిగుమతి విషయంలో చైనా గుత్తాధిపత్యానికి ఫుల్ స్టాప్ పడుతుందని స్పష్టం చేసింది. అత్యంత ఖరీదైన లిథియం నిల్వలు రాజస్థాన్ లో భారీ స్థాయిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డేగానాలోని రెన్వాత్ కొండ ప్రాంతంలో ఈ నిల్వలు నిక్షిప్తమైనట్లు వెల్లడించారు.

Also Read : మద్యం ధరలు భారీగా తగ్గింపు – మందుబాబులపై ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది..?

Advertisement